విజయవాడ

27న ఎంఎస్‌ఎంఈ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన ప్రకారం ఎపి ప్రభుత్వం ఈ నెల 27న ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) దినోత్సవం నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. లబ్బీపేటలోని ఏ కనె్వన్షన్ సెంటర్‌లో ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, బహుళజాతి కంపెనీలు, వివిధ రంగాలకు చెందిన బ్యాంకుల, జాతీయ స్థాయి లో ముఖ్య సంస్థల ప్రతినిధులు పా ల్గొంటారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం అదేరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఆ రోజు ఈ రం గానికి సంబంధించి పలు నిర్ణయాల ను ప్రకటిస్తారు. బహుమతులు కూడా అందజేస్తారు. దేశంలో ఇటువంటి కార్పొరేషన్‌ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా ఎపి నిలుస్తుంది. రాష్ట్రంలోని ఎంఎస్‌ంఈ పారిశ్రామిక వేత్తలందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని, ముందుగా తమ పేర్లను నమోదు చేయించుకోవాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.