హైదరాబాద్

1 నుంచి ఓటరు జాబితా సవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: మహానగర ఓటరు జాబితాకు ఎన్ని సార్లు సవరణలు చేపట్టినా తప్పులు సరికావటం లేదు. ఒకే ఓటరు పలు నియోజకవర్గాల్లో నమోదై ఉండటంతో కొన్ని సందర్భాల్లో ఓటర్ల సంఖ్య జనాభా కన్నా ఎక్కువగా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిహెచ్‌ఎంసి వచ్చే నెల 1వ తేదీ నుంచి మరో సారి ఓటరు జాబితా సవరణకు సిద్ధమైంది. నెలన్నర రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ నిర్వహించిన తీరులో మొట్టమొదటి సారిగా ట్యాబ్లెట్లు, కంప్యూటర్లను వినియోగిస్తూ ఈ సమగ్ర ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర ఓటరు జాబితా సవరణకు 3వేల 879 పోలింగ్ బూత్ స్థాయి అధికారులతో పాటు 392 మంది పర్యవేక్షకులను నియమిస్తున్నామని అన్నారు. వీరందరికీ ఖచ్చితంగా ఏ ఇంట్లో ఉన్న ఓటరు అదే ఇంటి నుంచి మాత్రమే నమోదు చేయటం జరుగుతుందని, ఇందుకు గాను నగరంలోని ప్రతి ఇంటికి నెంబర్లను వేసే ప్రక్రియను చేపట్టామని, ఇందుకు ఇప్పటి వరకు 92 శాతం పూర్తయిందని కమిషనర్ వివరించారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల సరిహద్దులను కూడా జియోట్యాగింగ్ ద్వారా నిర్థారించే నజారి నక్షల తయారీకి కూడా 80శాతం పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓటరు మరో పోలింగ్ కేంద్రంలో ఉంటే నమోదు సాధ్యం కాదని, పోలింగ్ కేంద్రాల సరిహద్దులను శాటిలైటింగ్ మ్యాపింగ్ ద్వారా చేపట్టడం జరిగిందని వివరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటరు జాబితా సవరణ అనేది అత్యంత ముఖ్యమైన భాగమని, ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు తమ పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లను కూడా నియమించి సహకరించాలని కమిషనర్ సూచించారు. దీని వల్ల ఓటరు నమోదు కార్యక్రమంలో మరింత పారదర్శకత చోటుచేసుకుంటుందని, జవాబుదారి తనం కూడా పెరుగుతోందని తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒసారి నిర్వహించే ఈ సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ రామకృష్ణారావుతో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.