హైదరాబాద్

ఓటరు జాబితాలో సవరణలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: జూలై ఒకటో తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి 18 ఏళ్లు నిండిన ప్రతి ఓటరును నమోదు చేసి జాబితా సవరణలో మార్పుల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిహెచ్‌ఎంసి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులతో ఓటర్ల లిస్టుల మార్పులు, చేర్పుల ప్రక్రియపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జూలై ఒకటి నుంచి ఆగస్టు 15వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల నమోదు చేసుకుని జాబితా సవరణలో మార్పులు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల హద్దులు, నిర్ధారణ చేసే నజారి నక్షల తయారీ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ మొదటి సారిగా ట్యాబ్ ద్వారా జిపిఎస్‌లో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఇఆర్‌ఓలు, ఎఇఆర్‌ఓలందరికి ట్యాబ్‌లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన వారికి ఈ నెల 28న శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 2008 డీలిమిటేషన్ ఆర్డర్ ప్రకారం జిల్లాల పునర్విభజన తర్వాత నియోజకవర్గాల సరిహద్దులు మారినందున ఇందుకు సంబంధించిన మార్పుల నివేదికను వెంటనే సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ రెవెన్యూ అధికారి భవానీ శంకర్ పాల్గొన్నారు.