రంగారెడ్డి

శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 23: పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని మేడిపల్లిలో కార్మిక పక్షపాతి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ పురపాలక సంఘం అధ్యక్షుడు ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ది మోహన్‌రెడ్డి పాల్గొని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం సేవలను వివరించారు. దేశంలో ఒకే జెండా, ఒకే ప్రధాని, ఒకే కరెన్సీ ఉండాలని, కాశ్మీర్ బారతదేశంలో తల లాంటిదన్నారు. ఉద్యమంలో భాగంగా డిల్లీ నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తే కాశ్మీర్ సరిహద్దులో కస్టడీలోకి తీసుకుని అనంతరం జైలులో విషప్రయోగంతో హత్యకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖర్జీ బలిదానంతోనే ఉవ్వెత్తున లేచిన ఉద్యమంతో తలొగ్గి కాశ్మీర్‌లో కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేశారని అప్పటి నుంచి కాశ్మీర్‌ను భారతదేశంలో చూడగలుగుతున్నా మన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా నాయకులు లోడె చంద్రయ్య, రాజశేఖర్‌రెడ్డి, రఘునందన్, దాసు, వెంకటేశం, గీత, శ్రీనివాస్ గౌడ్, శ్యాం, సోమిరెడ్డి, సంపత్, భాస్కర్ పాల్గొని శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
రాజేంద్రనగర్‌లో...
రాజేంద్రనగర్: డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఆశయసాధన కోసం పనిచేయాలని రాష్ట్ర భాజపా నాయకుడు వై.శ్రీ్ధర్ అన్నారు. శుక్రవారం డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా అత్తాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు సాబాద విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశంలో ఒకే విధానం ఉండాలని ఆకాంక్షించిన వారిలో మొదటి వ్యక్తి అని గుర్తు చేశారు. ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ నహి చెలెగే నహి చెలెగే అనే నినాదంతో పోరాటం చేసిన మహానేత అని గుర్తు చేశారు. న్యాయవాదిగా, కలకత్తా యూనివర్సిటికి రెండు పర్యాయాలు విసిగా, ఆల్ ఇండియా హిందూ మహాసభ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ఆరంభించారని అన్నారు. 1951 సంవత్సరంలో భారతీయ జనసంఘ్ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి సంచలనం సృష్టించారని తెలిపారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు నారగూడెం మల్లారెడ్డి, మోండ్ర కొమరయ్య, రాచూరి రాజశేఖర్, సాబాద విజయ్‌కుమార్, డి.సత్యనారాయణ, కె.కృష్ణ పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లిలో..
ఆధునిక హిందూత్వ, హిందూ జాతీయ వాదాన్ని ప్రగాఢంగా విశ్వసించిన మహానీయుడు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ అని బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకుడు బండి ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని మైలార్‌దేవ్‌పల్లి శివాజీచౌక్ వద్ద బలిదాన్ దివాస్‌ను డివిజన్ భాజపా అధ్యక్షుడు అడికె జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు అడికె రాజు, పి.మల్లేష్ యాదవ్, నవారు మురళీధర్‌రెడ్డి, భాస్కర్, వల్లూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
వికారాబాద్‌లో...
వికారాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఎదగడానికి కారణం శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.శివరాజ్ అన్నారు. శుక్రవారం ముఖర్జీ బలిదాన్ దివస్‌ను పురస్కరించుకుని స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిరంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మహావీర్ ఆసుపత్రిలో బిజెవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించి 30 మంది రక్తదానం చేశారు.