మెయిన్ ఫీచర్

మీ చెంతకే ఇంటి భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఇల్లాలికి వంటగదిలో ఊపిరి సలపదు. మూడు గంటల టైమ్‌లో ఇంటిల్లిపాదికీ యుద్ధ ప్రాతిపదికన వండిపెట్టాలి. ఈ తొందరలో వంటలు సరిగా కుదరవు. రుచీపచీ లేకుండా తయారవుతాయి. మధ్యాహ్నానికి పాడైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పిల్లాడు స్కూల్ నుంచి లంచ్ బాక్స్ తినకుండా పట్టుకొస్తే ఆ తల్లి మనసు చివుక్కుమంటుంది. అప్పుడనిపిస్తుంది, ఇంకొంచెం టైముంటే వంట కుదరేదేమో అని! ఇంకొంచెం సమయమిస్తే ఇంకో వెరైటీ చేసిపెట్టేదానే్నమో అని!
ఎంత ఇంటి భోజనమైనా సరిగా కుదరకపోతే బాధపడాల్సిన పని లేదు. మీరు తీరిగ్గా వండండి.. టైంకి మేం దాన్ని తీసుకెళ్లి మీ పిల్లాడికిస్తాం.. మీ ఆయన ఆఫీసులో అందజేస్తాం.. అంటూ వచ్చింది బెంటోవాగన్ అనే స్టార్టప్. ముంబై డబ్బావాలా మాదిరి ఇది హైదరాబాద్ డబ్బావాలా. పూర్తిగా ఇంటి భోజనాన్ని అందించే స్టార్టప్. స్కూల్లోగానీ, ఆఫీసులోగానీ లంచ్ సమయానికి బాక్స్ అందించే పూచీ వీళ్లది. ఇంటి దగ్గరికి వెళ్లి పికప్ చేసుకుని దాన్ని వర్క్ ఏరియాలో అందజేస్తారు. ఇలాంటి ఆలోచనతో చాలానే స్టార్టప్స్ వచ్చాయి కానీ, అవన్నీ సొంతంగా వండి తీసుకొచ్చేవే. కానీ ఇది మాత్రం పక్కా ఇంటి భోజనం అందించే స్టార్టప్.
ఇంకా చెప్పాలంటే ఇది విమెన్ ఓరియెంటెడ్ స్టార్టప్. ఒక మహిళ పొద్దున లేచిందిమొదలు పది పదిన్నరదాకా ఆమెకు కిచెన్‌లో ఊపిరి సలపదు. చిన్న గ్యాప్ కూడా ఉండదు. అదే కాస్త టైమిస్తే అంతకంటే అద్భుతంగా వండుతుంది. ఈ గ్యాప్‌ని పూరించాలనే ఉద్దేశ్యంతో.. సునీల్‌కుమార్ తన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషన్‌ని వదిలేసి స్టార్టప్ కోసం కొంత గ్రౌండ్ వర్క్ చేశారు. కొన్ని స్కూళ్ళకు వెళ్లి ఐడియా షేర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొన్నిసార్లు పిల్లల లంచ్ బాక్సులో అన్నం, కూరలు పాడైపోయేవని వాళ్లు చెప్పుకొచ్చారు. వాళ్ల సూచనలు, లోటుపాట్లు బెంటోవాగన్ స్టార్టప్‌కి మరింత ఊతమిచ్చాయి.
బెంటోవాగన్ అనేది జపనీస్ నుంచి వచ్చిన పదం. జపనీస్‌లో బెంటో అంటే అందంగా ముస్తాబు చేసిన లంచ్ బాక్స్ అని అర్థం. వాగన్ అంటే వాహనం. ప్రస్తుతానికి సొంత డబ్బులతోనే స్టార్టప్ మొదలుపెట్టారు. సిటీలోని కొన్ని ఏరియాల్లో ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఐదు కిలోమీటర్ల వైశాల్యంలో నెలకు రూ.500 సబ్‌స్క్రిప్షన్ చొప్పున లంచ్ బాక్స్ అందిస్తున్నారు. దూరం పెరిగితే కిలోమీర్‌కి ఇంత అని అదనంగా తీసుకుంటారు. ప్రస్తుతానికి వందమంది క్లయింట్స్ ఉన్నారు. టీంలో 15 మంది వరకు పనిచేస్తున్నారు. త్వరలో యాప్ వెర్షన్ తేవాలని ప్లాన్‌లో ఉన్నారు. స్థాపించి దాదాపు ఏడాది అవుతున్న ఈ స్టార్టప్ విస్తరణ కోసం తీవ్రంగా తన ప్రయత్నాలు చేస్తుంది. ఇల్లాలి చింత తీర్చే ఈ స్టార్టప్ తన ప్రయత్నంలో సఫలమవ్వాలని ఆశిద్దాం.