ఐడియా

ముసురు వేళలో.. దుస్తులు ఆరటం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చినుకుపడే వేళ వాతావరణం చల్లగా.. ఆహ్లాదంగా ఉన్నా ఆడవాళ్లకు ఇబ్బంది పెట్టే సమస్య బట్టలు ఆరకపోవటం. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు వారానికి ఒక్కసారి బట్టలు ఉతుక్కుంటారు. ఇంటిల్లిపాది దుస్తులు ఆరాలంటే ఆ ఇంటి ఇల్లాలికి తలకు మించిన సమస్యగా మారుతుంది. బట్టలు సరిగా ఆరక తేమగా ఉండి వాసన రావటంతో పాటు ఫంగస్ వ్యాపించి కొన్ని రకాల జబ్బులకు దారితీస్తుంది. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరాల్లో అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. ఇంట్లోనే ఎన్ని దుస్తులైనా ఆరేసుకోవాలి. ఇలాంటి చింతలేవి లేకుండా వర్షాకాలంలో తేలికగా బట్టలు ఆరేసుకోవటానికి సులువైన నాలుగు మార్గాలు ఇవి.
* మార్కెట్లో దుస్తులు ఎండబెట్టే హ్యాంగర్ చౌకగా లభిస్తుంది. దుస్తులను పొడిగా చేయటానికి సులువైన మార్గం. వార్డురోబ్‌లో ఈ హ్యాంగర్‌ను ఏర్పాటుచేసుకుంటే కాస్తంత తడిగా ఉన్న దుస్తులు వీటి మీద వేలాడేసుకుంటే చాలు పొడిగా మారతాయి. ర్యాక్ స్థానంలో దీని లాక్ చేసుకోవచ్చు. దుస్తులు నిడివిని బట్టి ఎత్తు సైతం సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ స్టాండ్ కిందే బాక్సులను ఏర్పాటుచేశారు. ఇక్కడ చెప్పులు, బూట్లు పెట్టుకోవచ్చు. మీరు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి బట్టలను హ్యాంగర్ పొడిగా ఉంచుతుంది.

* రెండు గంటల్లో దుస్తులు పొడిగా చేసే లాండ్రీ బ్యాగ్‌లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఇవి సాధారణ లాండ్రీ బ్యాగ్ కాదు. ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ లాండ్రీ సంచిలో ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా దుస్తులు వెంటనే ఆరిపోతాయి. షర్ట్స్, ఫ్యాంట్లు, బూట్లు, టోపీలు, చేతి తొడుగులు ఈ లాండ్రీ బ్యాగులో వేసుకుంటే పొడిగా మారతాయి. ఎలాంటి ఫ్యాబ్రిక్ వస్తమ్రైనా ఇందులో పొడిగా మారుతుంది.

* బాత్రూమ్‌లో బట్టలు ఉతికిన తరువాత వాటిని బయట ఆరేసేముందే నీరంతా కారి పొడిగా మారటానికి ఇలాంటి హ్యాంగర్‌ను ఏర్పాటుచేసుకోండి. బాత్రూమ్ కిటికీ తలుపులు తెరిస్తే గాలి వస్తుంది. అపుడు దుస్తులు పొడిగా మారతాయి. అంతేకాదు వాషింగ్ మెషిన్‌లో వేసిన దుస్తులను సైతం ఇలాంటి హ్యాంగర్ల మీద వేసుకుంటే చాలు.
* వర్షాకాలంలో దుస్తులకు సంబంధించి వచ్చే మరో ఆందోళన తేమ వల్ల వచ్చే పాత వాసన. హ్యాంగర్ ఉంచిన గదిలో ధూప్ వెలిగించండి. ఈ పొగ కూడా బట్టలను ఎండబెట్టడంలో సహకరిస్తుంది. అంతేకాదు సువాసనలు వెదజల్లుతాయి. ఇవన్నీ కూడా సహజసిద్ధమైన ప్రకృతి అందించే చర్యలు కాదు. ఇంట్లోకి ఏమాత్రం సూర్యుని వెలుతురు పడుతున్నట్లు కనిపించినా ఆలస్యం చేయకుండా తలుపులు, కిటికీ తలుపులు తెరవండి. సూర్యుని నుంచి వచ్చే కిరణాలు సేంద్రీయ క్రిమిసంహారిణిగా పనిచేస్తుందని మరిచిపోవద్దు.