భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వై.శివప్ప, కర్నూలు (ఆంధ్ర)
ప్ర:నాకు ఏ పనీ కలిసి రావటంలేదు. మాకు స్వంత యిల్లు ఎప్పుడు వస్తుంది?
సమా:మీరు ఏం చేస్తున్నారో చెప్పలేదు. మీరు చెప్పిన సంఖ్య కూడా సందిగ్ధంగా ఉన్నది. ‘ఏదీ తనంత తానుగా నీ దరికిరాదు. శోధించి సాధించాలి. అదియే ధీరగుణం’- శ్రీశ్రీగారి సినీ గీతంలోని పరమ సత్యాన్ని గ్రహించండి. చిత్తశుద్ధితో కృషి చేయండి. స్వగృహయోగం మీకు ఉంది. అధైర్యపడకండి.
వేణుగోపాల్ శర్మ, పటాన్‌చెరు (హైదరాబాద్)
ప్ర:ఆస్ట్రేలియా ప్రయాణం- తారాబల దోషానికి నివారణ చెప్పండి.
సమా:మీరు ఆస్ట్రేలియా చేరేవరకూ, మీరు ప్రయాణం చేస్తున్న స్థానంలో మీ యింటి కులదేవత ముందు అఖండజ్యోతి నేతితో వెలిగించి (మీరు ఆస్ట్రేలియా చేరేవరకూ వెలుగుతూనే ఉండాలి) ఒక సద్బ్రాహ్మణునికి స్వయంపాకం- ఐదుతో దక్షిణ సమర్పించి బయల్దేరండి. శుభం జరుగుతుంది.
చాట్ల వెంకట రమేశ్‌బాబు - చామకుర్తి (ప్రకాశం, ఆంధ్ర)
ప్ర:వివాహ విషయం - దిశ చెప్పగలరు.
సమా:నవంబర్‌లో వివాహయోగం- ఆగ్నేయ దిశ- ఈలోగా ఉత్తరం నుండి కూడా సంబంధం రావచ్చు. కాని కుదరుట సందేహం-
ఎమ్.నీరజ, నెల్లూరు (ఆంధ్రప్రదేశ్)
ప్ర:పి.జి చదువుతున్నాను. బాంక్ కోచింగ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. తీసుకోమంటారా?
సమా:తప్పక తీసుకోండి. మీ భవిష్యత్తు ఫైనాన్సు సంబంధమైన వృత్తిగల వారితోనే ముడిపడి ఉంది.
కొంగర దయాశిల దేవదానం, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
ప్ర:ఉద్యోగ వ్యాపారాలలో, ఆ మాటకొస్తే ఏ వృత్తిలోనైనా రాణించాలంటే ఏం చేయాలి?
సమా:ఆ సంబంధమై వృత్తి ఉద్యోగ నియమ నిష్ఠలను పాటించాలి. రాణింపు మీ వెన్నంటి వస్తుంది. ‘తన నియమమునకు కట్టుబడువాడు సర్వశక్తిమంతుడు’ అనే బైబిల్ సూక్తిని గుర్తుంచుకోండి. పవిత్ర బైబిల్‌ను క్రిష్టియానిటీ దృష్టితో కాకుండా అందలి సార్వజనీనతను సర్వకాలిక సూక్తులను పాటించండి.
హేమంత్ రాంకుమార్, కంచికచెర్ల (కృష్ణా)
ప్ర:వివాహం - ఉద్యోగం- ఆరోగ్యం ఎలా ఉంటాయి?
సమా:వివాహం ఉత్తర దిశ నుండి యోగం- ఉద్యోగం లాభదాయకమే. వాయవ్య దిశ- ఫైనాన్స్ బాంకింక్- రెవెన్యూ వంటి శాఖలుగా- ఆరోగ్యం ఆందోళనకరం. నరాల బలహీనత- ముఖ్యంగా పొత్తికడుపు- ఆ సంబంధ స్థానాలందు అనారోగ్యం- గొంతు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. కొంత నియమ నిష్ఠలను పాటించడం మంచిది.
వి.వి.ఎల్.శ్రావణి, విజయవాడ- కృష్ణా
ప్ర:నేను పాండిచ్చేరిలో ఎమ్.ఎస్.సి చేస్తున్నాను. నా ఉద్యోగం టెక్నికలా లేక మరేదైనానా?
సమా:నాన్ టెక్నికల్ అయ్యే అవకాశమే ఉంది. ముఖ్యంగా అకౌంటింగ్, బాంకింగ్ వంటివి అవకాశం.
ఎస్.శ్రీకాంత్ - విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర:ప్రభుత్వోద్యోగ యోగం ఉందా?
సమా:ప్రభుత్వోద్యోగ యోగం ఉంది. మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా ఫైనాన్స్ సంబంధమైన సంస్థల్లో అవకాశం ఉంది.
వట్టిపల్లి సుశీల, బీబీనగర్
(తెలంగాణా యాదాద్రి)
ప్ర:నేను గేదెలను కొనుక్కుందామనుకుంటున్నాను. బాగుంటుందా?
సమా:బాగానే ఉంటుంది. ఆగస్ట్‌లో ప్రయత్నించండి. క్షేత్రపాలకుడైన లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి మంగళవారం పాలు పంపించండి. లేదా ఇంట్లోనే నరసింహస్వామికి పాయసం, మినప వడలు నివేదన చేసి పేదలకు పంచిపెట్టండి.
దిలీప్, హఫీజ్‌పేట, హైదరాబాద్
ప్ర:వయసు మళ్లిన వేళలో కళ్యాణ యోగ కాంక్ష?
సమా:మీ వివాహ యోగానికి కాలదోషం పట్టింది. అంత అనుకూలంగా లేదు.
వై.సావిత్రీదేవి, రాజమండ్రి (తూ.గో)
ప్ర:అనారోగ్య బాధలు- ఆర్థిక బాధలు - బంధువుల నిస్సహాయత. ఏం చేయాలి?
సమా:మీవి ఇంచుమించు అష్టకష్టాలుగా చెప్పవచ్చు. మంగళగిరి పానకాల నరసింహస్వామి వద్ద ఒక పదకొండు రోజులు భక్తితో నిద్రచేసి యధాశక్తి పూజించండి. పరిష్కారం దొరుకుతుంది.
బాలాప్రసాద్ బల్దవా, చాంద్రాయణగుట్ట,
హైదరాబాద్
ప్ర:రాజస్థాన్ మే హమారీ మకాన్ ఔర్ జీవన్ బేచ్‌కే హైదరాబాద్ మే బస్‌జానా చాహ్ రహేహై- ఆప్‌కీ సూచనా హమ్ మానే్త హై- హిందీ వర్షన్ తెల్గూమే లిఖ్ ఖీజియే- హమారా మిత్ హమ్‌కో సమ్‌జాతాహై
సమా:హైదరాబాద్ ఔర్ చాంద్రాయణ్ గుట్టా ఆప్‌కేలియే అచ్చాహీ రహేగా- బర్కత్, ఔర్ హర్కత్ దోనో మిలేగా-
చెన్నుపల్లి వాణి, కావలి, నెల్లూరు (ఆంధ్ర)
ప్ర:వివాహం ఎప్పుడు జరుగుతుంది. నేను కోరుకున్న వ్యక్తితో జరుగుతుందా?
సమా:మీ వివాహ విషయంలో కొన్ని అభ్యంతరాల కారణంగా సమస్యలు రాగలవు. సంప్రదాయాన్ని పాటించండి.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ