గ్లామర్ కోసమే బికినీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందించిన డిజె - దువ్వాడ జగన్నాథమ్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. చిత్ర కథానాయిక పూ జా హెగ్డే చిత్ర విశేషాలను వివరించారు.
సినిమాకు ఆదరణ ఎలా ఉంది?
-సినిమా రెస్పాన్స్ బాగుం ది. నేను నటించిన సినిమా ల్లో ఈ సినిమాకు వ స్తున్న రెస్పా న్స్ చూస్తుంటే ఉద్వేగంగా ఉంది. ఈ విజయాన్ని చూసి ఆనందిస్తున్నా.

మీ పాత్ర ఎలా ఉంది?
- ఇందులో నేను అల్ట్రామోడరన్ అమ్మాయిగా నటించాను. నేను చేసిన ఐదుసినిమాల్లో ఇలాంటి పాత్రల్లో నటించా. ఇంతకుముందు సంప్రదాయబద్ధమైన యువతిగా, కాస్త సిగ్గు, బిడి యం ఉండేది. కానీ ఈ పాత్ర దానికి పూర్తి భిన్నంగా ఉంది.
అల్లు అర్జున్‌తో ఎలా?
- బన్నీ మంచి నటుడు. ముఖ్యంగా సెట్‌లో సరదాగా వుంటాడు. అతనికి తన పనిపై పూర్తి ధ్యాస ఉంది. ఇంకా బెటర్‌గా ఎలా చేయాలన్న తపన కనిపిస్తుంది. నాకు కూడా అనేక మెళకువలు చెప్పాడు. అతనితో అవకాశంవస్తే మళ్లీ చేస్తా.
దర్శకుడి గూర్చి?
- హరీశ్ శంకర్ వెరీ కూల్. సెట్‌లో చాలా కామ్ గోయింగ్‌గా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. సెట్‌లో అలా అంతమందిని మెయిన్‌టెయిన్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా తనకు కథపై చాలా పట్టు ఉంటుంది. ఇంటిలిజెన్స్ ఉన్న వ్యక్తి.
బికినీ వేశారుగా?
- ఔను. కథ ప్రకారంగా వచ్చే సన్నివేశమే అది. అయినా సినిమా అంటేనే గ్లామర్. కాబట్టి ఇక్కడ గ్లామర్ పాత్రలు చేయాల్సిందే.. తప్పదు!
బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్?
- ఇక్కడ చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. డిసిప్లిన్ ఉంటుంది. అందుకే అక్కడికీ ఇక్కడికీ తేడా బాగా కనిపిస్తుంది.
మహేష్‌తో ఛాన్స్?
- దాని గురించి ఇప్పుడు కాదు, త్వరలోనే తెలియజేస్తా.
నెక్స్ట్ ప్రాజెక్టులు?
- ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్నాయి. ఇంకా ఏ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు.

- శ్రీ