ఆటాపోటీ

ఒంటరి పోరాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* టెస్టు క్రికెట్‌లో ఒంటరి పోరాటాలు చేసిన బ్యాట్స్‌మెన్ చాలా మందే కనిపిస్తారు. అయితే, ఒక ఇన్నింగ్స్‌లో జట్టు స్కోరు వంద కూడా దాటని పరిస్థితుల్లో హాఫ్ సెంచరీ సాధించిన వీరులు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో శ్రీలంక మాజీ క్రికెటర్ అశాంక గుణసిన్హ ఒకడు. 1991లో లంక జట్టు భారత్‌కు వచ్చినప్పుడు చండీగడ్ టెస్టులో లంక 82 పరుగులకే ఆలౌటైంది. గుణసిన్హ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంటే జట్టు స్కోరులో 63.4 శాతం పరుగులు అతనివే. ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ శాతం పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ రికార్డు కూడా లంకకే దక్కుతుంది. 1983లో న్యూజిలాండ్‌తో కాండీలో జరిగిన టెస్టులో లంక 97 పరుగులకే ఆలౌటైనప్పుడు అర్జున రణతుంగ 51 పరుగులు చేసి అవుట్ కాలేదు. మొత్తం స్కోరులో ఇది 52.5 శాతం.

దటీజ్ మెక్‌కలమ్!
* హార్డ్ హిట్టర్‌గా పేరు సంపాదించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు కూడా ఉంది. కెరీర్‌లో ఆడిచిన చివరి టెస్టులో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసి, తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 2016 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో క్రైస్ట్‌చర్చిలో జరిగిన మ్యాచ్‌లో అతను 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అదే అత్యంత వేగవంతమైన శతకం. మొత్తం మీద అతను ఆ మ్యాచ్‌లో 79 బంతులు ఎదుర్కొని 145 పరుగులు చేశాడు. 56 బంతుల్లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్), మిస్బా ఉల్ హక్ (పాకిస్తాన్) పంచుకుంటున్న రికార్డును మెక్‌కలమ్ తన చివరి టెస్టులో అధిగమించడం విశేషం.

‘వాల్’కు బీటలు
* క్రీజ్‌లో పాతుకుపోయి బౌలర్ల సహనానికి పరీక్ష పెడతాడు కాబట్టే భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు ‘ది వాల్’ అనే పేరు స్థిరపడింది. అయితే, టెస్టు క్రికెట్‌లో ఎక్కువసార్లు క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేరిన బ్యాట్స్‌మన్ కూడా అతనే అంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ, ఇది అక్షరాలా నిజం. 164 టెస్టులు ఆడిన అతను 55 పర్యాయాలు బౌల్డ్ అయ్యాడు. సచిన్ 54, అలెన్ బోర్డర్ 53 సార్లు టెస్టులో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగి, వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అయితే, కనీసం 50 టెస్టు ఇన్నింగ్స్‌లో ఆడిన వారి జాబితాను పరిశీలిస్తే, కెరీర్‌లో ఎక్కువ శాతం ఇన్నింగ్స్‌లో బౌల్డయిన ఆటగాడిగా న్యూజిలాండ్‌కు చెందిన జాన్ రీడ్ తెరపైకి వస్తాడు. 58 టెస్టులు ఆడిన అతను 44 పర్యాయాలు బౌల్డ్ అయ్యాడు. కనీస సంఖ్య అనేది లేకపోతే, ఇన్నింగ్స్ స్పిన్నర్ శామ్ స్టాపెల్స్ కెరీర్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి, అన్నింటిలోనూ బౌల్డ్ అయ్యాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఈ విధంగా క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగిన ఎకైక ఆటగాడు అతనే.

- సత్య