ఆటాపోటీ

అందరూ అందరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ బోర్డును ఆటగాళ్లు ఉపయోగించుకుంటున్నారా లేక ఆటగాళ్లకు ఉన్న పేరుప్రఖ్యాతుల్ని, ప్రజల్లో వారికున్న అభిమానాన్ని బోర్డు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారా? నిజం చెప్పాలంటే రెండూ నిజమే. క్రికెట్‌కు సంబంధం లేని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు దశాబ్దాలుగా బోర్డును ఏలుతున్నారు. క్రికెట్‌లో ఒనమాలు తెలియనివారి సంఖ్యే బోర్డు కార్యవర్గంలో ఎక్కువగా ఉండేది. దేశంలో క్రికెట్‌కు ఉన్న అభిమానాన్ని సొమ్ము చేసుకోవాలంటే, ఆటగాళ్లను ఎరగా వేయాలన్నది బోర్డు అనుసరించిన సూత్రం. అందుకే, ఒకవైపు వారికి ప్రయోజనాలు చేకూరుస్తూ, మరోవైపు కోట్లకు పడగలెత్తింది. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులున్న క్రీడా సంస్థగా ఎదిగింది. చివరికి భారత ప్రభుత్వాన్ని, సుప్రీం కోర్టును ఎదిరించే స్థాయికి చేరింది. ఈ కోణంలో చూస్తే క్రికెటర్లను బోర్డు తన ఎదుగుదలకు ఉపయోగించుకుందని స్పష్టమవుతుంది. అయితే, ఈ నాణానికి మరో కోణం కూడా ఉంది. తమతోనే బోర్డు ఎదుగుదల ఆధారపడిందనే విషయం క్రికెటర్లకు అర్థమైంది. బోర్డు తమను ఏమీ చేయలేదన్న ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బోర్డు నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కోట్లకు కోట్లు లాగేస్తున్నారు. రెండు చేతులా ఆర్జిస్తున్నారు. మొత్తానికి ఇరు వర్గాలు పరస్పర ప్రయోజనాలు పొందుతున్నాయి. క్రికెట్‌ను ఒక వ్యాపారంగా మార్చేసి, అభిమానులను వెర్రివాళ్లను చేస్తున్నాయి. జరుతున్న తతంగాన్ని అర్థం చేసుకోలేకపోతున్న పిచ్చి అభిమానులు మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియాలకు పరుగులు తీస్తునే ఉన్నారు. టీవీలకు అతుక్కుపోతునే ఉన్నారు. క్రికెటర్లను భుజాలపై మోస్తునే ఉన్నారు. వారికి స్టార్ డమ్‌ను తెచ్చిపెడుతునే ఉన్నారు.