నెల్లూరు

స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖలేజాముసలిది కథ బాగుంది
గతవారం మెరుపులో పోట్లూరి సుబ్రహ్మణ్యం గారు రాసిన ఖలేజా ముసలిది కథ బాగుంది. ఒక వ్యక్తిలోని ఆత్మస్థయిర్యం ఎంతటి పనినైనా చేయిస్తుంది. ఒక సామాన్యుడు చేయలేని పనిని చేసి ముసలమ్మ నిజంగా ఖలేజా వుందనిపించుకుంది. ఎలుగుబంటితో పోరాడి గెలవడమంటే మాములు విషయం కాదు. ఆమెలోని ఆత్మస్థయిర్యం, తెలివితేటలే ఇందుకు కారణం. కథను కూడా మొదటి నుంచి చివరి వరకు చక్కటి సంభాషణలతో అందించారు. అప్పటి ఉదయగిరి అడవుల్లో పల్లెవాసుల పరిస్థితులను బాగా వివరించారు.
- తమ్మినేని తిరుపతిరెడ్డి, ఒంగోలు
- అయినాబత్తిన ఘనశ్యాం, వింజమూరు

గొప్పనీతిని అందించిన పాపం కాకమ్మ
గౌతమి గారు రాసిన పాపం కాకమ్మ కథ చాలా బాగుంది. చిన్నకథలో గొప్ప కథను పొందుపరిచారు. నిజంగా దూరపు కొండలు నునుపుగానే వుంటాయి. కానీ అక్కడ ఏదో వుందనుకుని పరుగెత్తి వెళితే అక్కడ అంతా శూన్యంగా వుంటుంది. చక్కగా అడవుల్లో వుండే కాకి నగరంలో ఏదో వుందనుకుని నగరానికి రావడం అక్కడ పరిస్థితులకు ఇమడలేక మళ్లీ అడవిలోకి వెళ్లడం ఇప్పటి పరిస్థితులకు నిదర్శనం. పల్లెటూళ్లు మన సంస్కృతీ సాంప్రదాయాలకు లోగిళ్లు. అలాంటి పల్లెటూళ్లను నేడు వదిలిపెట్టి పట్టణాలకు రావడం ఫ్యాషనైపోయింది. కాకి కూడా అలాగే చేసి చివరకు బుద్ది తెచ్చుకుంది. ఈ మనుషులకు ఎప్పుడు కలుగుతుందో కనువిప్పు చూడాలి..
- శేఖర్‌బాబు, నెల్లూరు
- శృతి ప్రియాంక, తిరుపతి