విశాఖపట్నం

మాతృభాషను మరువకుమా... (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో తీయనిది తెలుగు భాష
తెలుగు భాష జాతి వెలుగు భాష
పరభాష పోకడలతో
నీ భాషను నిరసించకు
తెలుగు అక్షరాలను పూమాలగా కూర్చి
తెలుగు మాత కంఠాభరణంగా అలంకరించు
తేనెలొలుకు తెలుగు భాష
దేశ భాషలందు తెలుగు లెస్సని
నలుదిక్కులా ఎలుగెత్తి చాటు
తెలుగు భాషను ప్రేమించు
తెలుగుకు జీవం అద్ది
రేపటి తరానికి అందించు
అన్య భాషలపై మోజు తగదు
మాతృభాషపై నిర్లక్ష్యం వలదు
నువ్వు, నేను, మనం
తెలుగు వారందరం తెలుగు మాట్లాడదాం
- రాయవరపు సరస్వతి,
చోడవరం, విశాఖ జిల్లా-531036.

జ్ఞాననిధులు

మల్లెపూల పూపరిమళం
మనసు భావ పరిమళం
ఓ మనిషీ ఎదుగుతున్న నీ మనసు
సంస్కారానికి దర్పణం
ఎదగని నీ మనసు
కుసంస్కారానికి అర్పణం
పరిమళమున్న పువ్వు ఓ అందం
మనసున్న మనిషిది
ఓ అపురూప బంధం
పూల పరిమళం చిత్రమైంది
మనసు భావం విచిత్రమైంది
- యలమంచిలి శివాజీ

భాగ్యం సౌభాగ్యం

ఏమండీ నాకేదో దిగులుగా ఉంది
మీ ఆరోగ్యం రోజు రోజుకి
దిగజారుతోందా
ఆ సూర్యాస్తమయాన్ని చూడండి
ఆ కాంతి విహీనమేదో
నన్ను కలవరపెడుతుంది
భాగ్యం నీవేనా ఈ మాటలు
ఆరుగురు పిల్లల
సంసార సముద్రాన్ని ఈదిన
సాహస నావికవు
నా అనారోగ్యానికి
కాసులపేరమ్మిన త్యాగశీలివి
ఎన్నో సమయాలలో
నాకు ధైర్యాన్ని చెప్పిన ధైర్యశాలివి
అది సూర్యాస్తమయం కాదు
రేపటి మహోదయానికి నాంది
నిత్య నూతన శోభతో
నీ నుదుట వెలిగే కుంకుమ రేఖది
దిగులెందుకు నువ్వే నా భాగ్యానివి సౌభాగ్యానివి
- ఆండ్ర కవి మూర్తి,
అనకాపల్లి. సెల్ : 9246666585.

ఆశగా...

చదువు కొనుక్కున్నవాడు
కట్నం రూపేణా గుంజుతున్నాడు
వైద్య విద్యకు లక్షలు పెడితే
రోగ నివారణకు వేలు పిండుతున్నాడు
దైవ దర్శనానికి యాత్రలకు వెళితే
నిలువుదోపిడీ రవాణా ఛార్జీల మోత
అభివృద్ధి వైపు పరుగు రాజకీయాల ప్రకటన
కోట్ల కొద్దీ ప్రణాళికలు
సామాన్యుడు ఆశగా ఆకాశంలోకి...
- గుడిమెట్ల గోపాలకృష్ణ, అరసవిల్లి