విశాఖపట్నం

నేత (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిపక్షంలో చురుకైన నేత కొండా మోహనరావు. ప్రతిపక్ష నేత తర్వాత అతనే పార్టీని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడు. అలాగే అధికార పక్ష నేతలని, ముఖ్యమంత్రులని తన స్వరంతో, మాటల మహిమతో, పదునైన సంభాషణలతో ఇరుకున పెడతాడు. ఒక్కొక్కసారి ప్రభుత్వంపై ధ్వజమెత్తుతాడు. అధికార నేతలకి అతన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక కంగారుపడుతుంటారు. అతను రైతు సమస్యలపై అనర్గళంగా మాట్లాడగలడు. ఎందుకంటే రైతు కుటుంబం నుండి వచ్చిన వాడు కాబట్టి అతనికి రైతుల కష్టం తెలుసు.
వేసవి కాలం రావడంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంతో చలించిన కొండ మోహనరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడానికి సిద్ధమయ్యాడు.
గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారికి
మీ ప్రభుత్వం రైతులు వేయడం వలన గెలిచింది. ఇప్పుడు ఆ రైతులని మీరు పట్టించుకోకపోవడం దారుణం. వేసవిలో వారి కష్టాలు చెప్పలేనివి. చుక్క నీరు లేక విలవిల్లాడుతున్నారు. మీకు ఎప్పుడూ కంపెనీల గోలే తప్ప రైతుల గురించి పట్టించుకోవడంలేదు. రైతులకు ఇవ్వాల్సిన విత్తనాలు ఇవ్వడం లేదు. రైతులకు స్పెష్టల్ ప్యాకేజీ ఇచ్చామని చెప్పడమే తప్ప అది ఎవరికి ఇచ్చారో, ఎంత మందికి ఇచ్చారో తెలియదు. అదంతా మీ ఖజానాలోకి వెళ్లిందనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. నేను, మా నేత త్వరలో రైతు పక్షాన నిల్చుని పోరాడుతాం. రైతులను మోసం చేసిన నాయకుడిగా ఇప్పటికీ మీకు పేరుంది. త్వరలో మీరు కుర్చీ దిగడం ఖాయం. ఇది నా ఆకాంక్ష. ప్రజల ఆకాంక్ష’ అంటూ ఉత్తరం ముగించి మీడియాకి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో అధికార పార్టీ నాయకులు మోహనరావు ఇంటికి వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు.
‘‘మోహనరావుగారు మీరు ప్రతిపక్షంలో ఉండడం చాలా బాధగా ఉంది. ఇప్పటికి పది సంవత్సరాలు అందులోనే ఉన్నారు. మీ లాంటి నాయకుడు అధికార పార్టీలో ఉంటేనే మేలు’’ అన్నారు అధికార పార్టీ నేతలు.
‘‘ఇప్పుడు మీరు అధికారంలో ఉండవచ్చు. రేపు మేముంటాం’’ అన్నాడు మోహనరావు.
‘‘ఇప్పుడు విషయం ఏమిటంటే మా ముఖ్యమంత్రిగారు మీరు మా పార్టీలోకి వస్తే మీకు రాజ్యసభ సీటు ఇస్తారు. మంచి అవకాశం. అధికారంలో ఉన్నంత వరకు మీరు ఆస్తులు సంపాదించుకోవచ్చు. మీ ఎంతో మంది ఈ సీటు కోసం ఎదురు చూస్తున్నారు’’ అన్నారు.
రాజ్యసభ సీటు అనగానే ఆనందం కలిగింది మోహనరావుకి.
‘‘సరే’’ అన్నాడు వాళ్లతో.
వాళ్లు వెళ్లిపోయారు.
వారలా వెళ్లగానే ఉత్తరాన్ని మార్చాడు.
‘గౌరవనీయులైన ప్రతిపక్ష నేత గారికి
పార్టీ ఓడిపోవడానికి మీరు రైతులను పట్టించుకోకపోవడమే కారణం. అధికార పార్టీ వేసవిలో రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది. మీరు కంపెనీలు రావాలని ఆలోచిస్తారు తప్ప రైతుల గురించి ఆలోచించరు. ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుంది. విత్తనాల సరఫరా కూడా క్రమం తప్పకుండా చేస్తుంది. ఇలాంటి మంచి ప్రభుత్వంపై నేను విమర్శలు చేయలేకపోతున్నాను. మీరు రైతుల పక్షపాతి కాకపోవడం వల్ల వారికి పార్టీ చాలా దూరంగా ఉండిపోయింది. నేను రైతు కుటుంబం నుండి వచ్చాను కాబట్టి రైతుల పార్టీ అయిన అధికార పార్టీలోకి వెళుతున్నాను’ అంటూ ముగించి మీడియాకి ఇచ్చాడు.
మర్నాడు అధికార పార్టీలో చేరిపోయి, రాజ్యసభ సీటు దక్కించుకున్నాడు.

- నల్లపాటి సురేంద్ర, గాజువాక. సెల్ : 9490792553