విజయవాడ

అనుబంధం (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారులోంచి కొడుకు వెనుక నించి దిగుతున్న ఇంగ్లీషు కోడలిని కళ్లప్పగించి చూస్తుండిపోయింది తాయారమ్మ. ఆమె చేతిలోని రెండేళ్ల పసివాడిని ఎత్తుకొని ముద్దాడింది. ‘నీ పేరేమిటిరా కన్నా!’ అని అడిగి ‘కాశీవిశ్వనాథం’ అని వాడు చెప్పగానే ముద్దులతో ముంచెత్తింది. మరి ఆవిడ భర్త పేరు అదే! ‘్ఫర్వాలేదు. నా కొడుక్కి తండ్రి గుర్తున్నాడు. మరి తల్లి? ఆరేళ్ల క్రితం మేనమామ కూతురు చంద్రకళని పెళ్లి చేసుకుంటే? తానొప్పుకోలేదని ఇల్లు విడిచి వెళ్లిపోయిన కొడుకు మళ్లీ ఇనే్నళ్లకి వచ్చాడు’ ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మిత్రుల సాయంతో అమెరికా వెళ్లిపోయి వారి సాయంతోనే పెళ్లి చేసుకొని చంద్రకళని కూడా అమెరికా తీసుకెళ్లాడు ఆనంద్.
పక్కింట్లో వుండే పిన్నికూతురు సుకన్య.. ఆనంద్ వచ్చాడని తెలిసి వచ్చి రోసీని కౌగిలించుకుంది. తెల్లబోయి చూస్తున్న పెద్దమ్మతో ‘వదిన తరచుగా నాతో మాట్లాడేది. నాకు ఇంగ్లీషు వచ్చుగా!’ అంది. కోడలితో మాట్లాడాలంటే కుదరదు. ఆమెకు తెలుగు రాదు. తనకు ఇంగ్లీషు రాదు. బాధపడింది తాయారమ్మ. ‘నాకొడుక్కి తెలుగు భాష పూర్తిగా నేర్పాను. నీకు కావలసినన్ని కబుర్లు చెపుతాడు విను’ అన్నాడు ఆనంద్. ‘నాకు చాలా బాధగా వుంది అత్తయ్యని మోసం చెయ్యటం. నిజం చెప్పేస్తాను’ అంది చంద్రకళ ఇంగ్లీషులో. ‘కంగారు పడకు. అన్ని విషయాలూ మెల్లిగా చెపుదాం. రెండ్రోజుల్లో మనవడితో ఆమెకు చాలా దగ్గరితనం వచ్చేస్తుంది. అప్పుడు చెపితే తేలిగ్గా వుంటుంది’ అన్నాడు ఆనంద్. నాలుగురోజుల్లో మామ్మా-మనవడి అనుబంధం ఒకరిని విడిచి ఒకరు వుండలేనంతగా పెనవేసుకుపోయింది. ‘మామ్మా! నేను నిన్ను విడిచి వెళ్లను. నీదగ్గరే వుంటాను’ అని ముద్దుముద్దుగా అంటున్న మనవడిని ముద్దాడుతూ ‘మీరేమంటారు? వీడు నా వారసుడు’ అంది తాయారమ్మ. ‘వీడిని మీకు అప్పగించటానికే వచ్చాం అత్తయ్యా! త్వరలో మేము కూడా ఇక్కడికే వచ్చేస్తాం’ అంటూ కాళ్లకు నమస్కరిస్తున్న రోసీ ఉరఫ్ చంద్రకళని అక్కున చేర్చుకుంది తాయారమ్మ.

- వేమూరి రాధాకృష్ణ, విజయవాడ.