రాజమండ్రి

మళ్లీ రావాలయ్యా (మనోగీతికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటక రంగం
నీ పునాది
సినీ రంగం నీ ప్రతిభకు
పలికింది నాంది
చిన్న నటుల నుండి
పెద్ద నటుల వరకు
నీ చేతిలో పండినవారే
నీ స్పర్శతో నీ చూపుతో
ఉన్నత శిఖరాలకు ఎదిగినవారే
నీలో దర్శకుడు మాత్రమే కాదు
నటుడూ బయటపడ్డాడు
ప్రతి పాత్ర పాఠ్యగ్రంధం
ప్రతి చిత్రం కళాఖండం
సామాజిక చైతన్యానికి
మానవ సంబంధాలకు
నీ సినిమాలు పెద్ద పీట వేశాయి
వ్యక్తినీ వ్యవస్థనీ
ఆలోచింప చేశాయి
నీ మాటలు మంత్రాలు
నీ పాటలు ఆపాతమధురాలు
ఏ రసవత్తర సన్నివేశమైనా
రక్తం ఉప్పొంగాల్సిందే
రాతి గుండెలు సైతం
కంట తడి పెట్టాల్సిందే
ఓ దర్శక త్రిశూలి
ఇది నీ శైలి
జీవితంలో స్వర్గం నరకం
రెంటినీ సమంగా స్వీకరించి
చలన చిత్ర గమనానికి
తూర్పుపడమర నిర్దేశించిన
మహా మనీషివి నువ్వే
మేఘ సందేశం అందుకొని
సుదూర తీరాలకు తరలిపోయిన
బహుదూరపు బాటసారి
ఓ దాసరి
నీ సరి ఎవరయ్యా
నీకు దండాలయ్యా
మళ్లీ నువ్వు రావాలయ్యా
- మంకు శ్రీను
కొప్పర్రు, 89859 90215

భూమి నా భావావేశం

నువ్వూ నేనూ..
అంతా భూమిపుత్రులమే
ఈ పుడమితల్లి
తన పచ్చటి ఒడిలో
మనిషి బతుకును పూదోటగా
చేసి కోడి తన రెక్కలచాటున
పిల్లల్ని దాచినట్లు
భూమాత కాలుష్యపు
బొంతగద్దల నుండి కాపాడుతోంది!

ప్రతిగా ప్రతి మనిషీ నిర్దయగా
పచ్చదనాన్ని కబ్జా చేస్తూ
బతుకును దుర్గంధపు
రొంపిని చేసుకొంటున్నాడు!
పక్షుల కిలకిలారావాలతో
సకల జీవరాసులకూ నెలవై
నిత్యశోభాయమానంగా వున్న
ప్రకృతికన్య నిత్యం దుఃఖిస్తోంది

జనం గుండెలనిండా జాలువారిన కలలు
కల్లలయి పోతున్న ఈనాడు
కనుమరుగవుతున్న పచ్చని
మనిషితనము!
ప్రతి రాత్రీ అమృతం కురిసిన
రాత్రే అవుతుంది అనుకున్నా
మా వెకిలిగాడి ప్లాస్టిక్ పల్టీలు
చూశాక తెలిసింది ప్రతిరాత్రీ
గరళం కురిసే రాత్రేనని!

మనిషిప్పుడు
సౌకర్యాల సౌధాలతో
కృత్రిమ కాంతను కావలించుకు
నిద్రిస్తున్నాడు!
పుడమి తల్లి పచ్చి బాలింతయి
భూబకాసురులను చూసి
పలవరిస్తూ విలాపాఘు్నలు
చిందిస్తోంది!

పూచే ప్రతి పువ్వూ నా ఆత్మ
విత్తే ప్రతి విత్తూ..
నాకు విన్నాణం!
మా తాత తండ్రులు
దున్నిన భూమి సాక్షిగా
చెబుతున్నాను
మట్టిని ధ్వంసం చేసిన వాడు
మట్టిగొట్టుకుపోతాడు!

భూమి నా భావావేశం
భూమి నా కన్నతల్లి, నా నేస్తం
నా పచ్చదనాన్ని తగులబెట్టి
చెట్లను నరికేస్తున్న
ఓ నరకాసుర సంతానమా!
మీరు నిర్మించుకుంటున్న
కాంక్రీటు సౌధాలే
మీ సమాధులవుతాయి జాగ్రత్త.. జాగ్రత్త..!
- డా.నెమిలేటి,
చరవాణి : 9490182636