దక్షిన తెలంగాణ

నిరీక్షణ (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె కమ్ముకుంటున్న సంధ్యావెలుగుల్లో
నిరీక్షణ చూపుల దారాల్ని ఎక్కుపెట్టి నిల్చింది!
గమ్యం తెలియని చీకటి దారుల్లో
ఒక్కతిగా సాగిపోతూ..
తెరచాప బతుకు రెపరెపల్ని ముందుకు సాగించింది!
వెంట నడిచే ధీరుడు లేకున్నా
వెనె్నముకగా నిలిచే నేస్తం
చేయూత నివ్వకున్నా
రేపటి భవిష్యత్తుపై ఆమె ఆశ చావదు!
అయినా.. ఆమె ముసిరిన తెలిచీకట్లను
చీల్చుకొని ప్రసరించే వేగుచుక్కలా ప్రకాశిస్తుంది!
తూర్పు వాకిలిలో విరిసిన సిరిమల్లెగా
ఆమె నిత్యమూ ఏదో ఒక కొత్తదనంతో
పునర్జీవిస్తూనే ఉంది!
విస్తరిస్తున్న ఉదయాస్తమయాల మధ్య
ఆమె అంతరాత్మ దేహరాగమై పరిమళిస్తుంది!
ఆమె తలపు.. ఆమె పిలుపు
ఎప్పుడు గుర్తుకువచ్చినా..
పూర్తికాని కల ఒకటి
నన్నావహించినట్లుగా
సంధ్యా వెలుగుల దోబూచులాటలో..
పోల్చుకోలేని చిరు చీకటి తెరలలో
నేను ఎక్కడో.. ఆమె ఎక్కడో
మళ్లీ మళ్లీ నిరీక్షిస్తూనే ఉంటాం!!
- బి. కళాగోపాల్
నిజామాబాద్, సెల్.నం.9441631029

అదృష్టజీవి

ప్రభాతపు సూర్యుడు
సుప్రభాతం పాడుతాడు
నిశీధిలో చంద్రుడు
జోలపాట పాడుతాడు
కలలోకి అప్సరసలు వస్తారు
కమనీయంగా నృత్యాలు చేస్తారు
ఊహలలోకి ముల్లోకాలు వస్తాయి
ఎన్నడూ చూడని అందాలను తెస్తాయి
అరచేతిలో వైకుంఠాలను ఇస్తాయి
భూలోకానే్న స్వర్గంవలె చేస్తాయి
నిజంగా మనిషి
ఎంతటి అదృష్టజీవి?
- డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి, సెల్.నం.9440468557

కాలం!

ఎవ్వరూ..
పోయిన కాలాన్ని తిరిగి
వెనక్కి తీసుకరాలేరు!
కొవ్వొత్తి కలిగినట్లు
పగిలిన గుడ్డు అతకనట్లు
కాలం కనుమరుగవుతుంది!
అందుకే.. కాలం విలువ తెలుసుకుని
మసలుకోవాలి!
ప్రతి క్షణం సద్వినియోగపరుచుకోవాలి!
ప్రతి సెకను విలువైనదేనని గ్రహించు!
ప్రగతి పథాన పయనించు!
అనుకున్నది సాధించు!
- చీకట్ల సంగీత, తక్కల్లపల్లి గ్రామం
జగిత్యాల జిల్లా, సెల్.నం.9618059689

ఎగిసిపడుతున్న సాగరం

నీ ఆశల కుంపటి మీద
నడిచి రావాలని నాకు లేదు
నీ అధికారం మెట్ల మీద
నిరంతరం జారిపడటం నాకు యిష్టంలేదు
నేను పోరాటానికి సిద్ధంగా వున్నాను
సంక్షేమాలు, పథకాలు,
నీ ఆశల సరిగమలు
నీ చెమట కాదు, నా కష్టం
సంస్కరణల పేరుతో ప్రజలను
చావు బాటలోకి నెట్టుతున్న
నీకు సమాధి చేయాలనే
పోరాటానికి పదును పెడుతున్నాను
ఈ దేశం నాది!
నా భూమి, నా గాలి
నా చెట్టు, నా చేను
నా అడవి, నా పంట
అన్నీ నావే!
నామీద పెత్తనం చేస్తూ
సంక్షేమాలు, సబ్సిడీలు, ఉచితాలు
అన్నీ నీవంటూ ఫోజులెందుకు?
నీ మీద, నీ ఫోజుల మీద,
నీ అధికారం మీద
యుద్ధానికి సిద్ధమవుతున్నాను నేను!
- సిహెచ్.మధు, నిజామాబాద్, సెల్.నం.9949486122

వర్షం కురిసిన రాత్రి

నీ కేసరి కొనసాగిన
నా అనే్వషణలో
బంధాలో.. బాధ్యతలో
నా శ్వాసను నియంత్రిస్తున్నాయి!
ఊపిరి సలపని సమస్యల వలయాలు
నన్ను నన్నుగా వెలివేస్తే..
తోడుని కోల్పోయిన వేళ
శాశ్వత నిద్రాస్థతికి చేరువలో..
కలల రెక్కల్ని తొడుక్కుని
ఆరంభించిన నా ప్రయాణం
మూల మలుపులోనే ముగుస్తుందని
కలిసిన చూపులు కడసారివని
పంచుకున్న ఊహలు
కలబోసుకున్న వెనె్నల ఊసులు
తూనీగలై ఎగిరిపోతే..
వర్షం కురిసిన రాత్రి
పంచుకోవడానికి.. మనిద్దరికి
జ్ఞాపకాలు తప్ప ఏం మిగిలాయి!
- పొద్దుటూరి మాధవీలత
ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా
సెల్.నం.9030573354