హైదరాబాద్

కల్తీ పన్నీర్, నెయ్యి పరిశ్రమలపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 24: నకలీ పన్నీర్, నెయ్యి తయారీ పరిశ్రమపై బాలానగర్ ఎస్‌ఓటి, జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. సుభాష్‌నగర్‌లో నివాసముండే ఎం.విజయ భాస్కర్‌రెడ్డి (32), ఎం.అశోక్‌కుమార్‌లు కలిసి ప్రణీత్ డైరీ మిల్క్ ట్రేడర్స్‌ను కొనసాగిస్తున్నారు. ఇందులో నకిలీ పన్నీర్, నకిలీ నెయ్యిలను తయారుచేసి మార్కెట్‌లోకి సరఫరా చేస్తుంటారు. సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్‌ఓటి మరియు జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా శనివారం దాడి చేశారు. ట్రేడర్స్‌లో పెరుగులో వాడే సిట్రిక్ యాసిడ్ పౌడర్, సోయాబీన్స్, స్టాగ్నెంట్ నెయ్యి పదార్థాలు ఉన్నాయి. విజయభాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 15 కిలోల సిట్రిక్ యాసిడ్ పౌడర్, 40 కిలోల పాడైన నెయ్యి, 15 బ్యాగ్‌ల (ఒక్కో బ్యాగ్‌లో 50 కిలోలు) సోయాబీన్స్, 16 బ్యాగుల (ఒక్కో బ్యాగు 25 కిలోలు) మాధవ్ స్ప్రే డ్రైయిడ్ స్కిమ్మ్‌డ్ మిల్క్ పౌడర్‌లతో పాటు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిర్వాహకుడు అశోక్‌కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.