హైదరాబాద్

ప్రైవేటు సంస్థలకు పారిశుద్ధ్య నిర్వహణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: మహానగరంలో పారిశుద్ద్య పనులు మరింత మెరుగ్గా సాగేందుకు వీలుగా నిర్వాహణ బాధ్యతలను ప్రైయివేటు సంస్థలకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు.
ఘన వ్యర్థాల నియంత్రణపై శనివారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశుద్ద్య నిర్వాహణ పనులను ప్రైయివేటు సంస్థలకు అప్పగించి, వాటి ద్వారా చెత్తను సేకరించే ప్రక్రియతో ఫలితాలెలా ఉంటాయో జిహెచ్‌ఎంసి అధికారులు అధ్యయనం చేయాలని సూచించారు. త్వరలోనే ఈ ప్రక్రియను నగరంలోని ఓ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వ్యర్థాల నియంత్రణ చాల కష్టమైన పని అని, ప్రతిరోజు సిటీని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖదని ఆయన గుర్తుచేశారు.
నగరాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వాహణలో నగరవాసుల భాగస్వామ్యం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వాహణ కేవలం స్థానిక సంస్థలదేనన్న భావన నగరవాసుల్లో ఉందని, ఆ అభిప్రాయాన్ని దూరం చేసుకోవాలన్నారు. నగర పాలనన యంత్రాంగానికి పౌరులకు మధ్య చాలా అంతరం ఉందని, దాన్ని తగ్గించుకునే దిశగా అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. నూ దిల్లీ లాంటి నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలను పరిశుభ్రత, పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వాహణలో భాగస్వాములను చేస్తున్నారని, దీని వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు. చెత్తను వేరు చేసే విధానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
పరిశుభ్రత, వ్యర్థాలను తడి,పొడి చెత్తగా విడదీయటం తదితర అంశాలపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వ తాగునటి, పారిశుద్ద్య విభాగం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వి.రాధ మాట్లాడుతూ నగర పాలనలో స్థానిక ప్రజల భాగస్వామ్యం అవసరమని, ఈ రకంగా ప్రజల భాగస్వామ్యం పెంపొందించటంలో జిహెచ్‌ఎంసి ముందంజలో ఉండటం పట్ల అభినందించారు. ఎలైట్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, అజయ్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ టి.కె.శ్రీదేవితో పాటు దేశ విదేశాలకు చెందిన 20 రాష్ట్రాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులు, ఘన వ్యర్థాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ రంగాల నిపుణులు హజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ మహానగరాలకు చెందిన కార్పొరేషన్ అధికారులు ఘన వ్యర్థాల నియంత్రణకు తాము అనుసరిస్తున్న విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.