రంగారెడ్డి

ఈ బోరుబావుల నోర్లు మూయరా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 24: నోళ్లు తెరుచుకున్న బోరుబావుల్లో పలువురు ఆభం శుభం తెలియని చిన్నారులు పడి మృత్యువాత పడుతున్నా.. ఇంకా అక్కడక్కడా బోర్లను ఓపెన్‌గానే తెరిచి ఉంచుతున్నారు. దీంతో ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు. మేడ్చల్‌లోని మండలస్థాయి అధికారుల కార్యాలయాలతో పాటు వివిధ ప్రాంతాల్లో బోర్లు వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయ. మేడ్చల్ ప్రాంతంలో ఇప్పటివరకు అలాంటి దుర్ఘటన ఏదీ చోటు చేసుకోనప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం మాత్రం పొంచి ఉందని చెప్పక తప్పదు. తహశీల్దార్ కార్యాలయంలో బోరు నీరు పడకపోవడంతో ఎన్నో సంవత్సరాల క్రితం మరమ్మతుల కోసం తెరిచి ఉన్న దాని నోరు మూయకుండా అలాగే నిర్లక్ష్యంగా వదిలేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. పత్రికల్లో గతంలో కూడా ఈ విషయమై కథనాలు వచ్చిన అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోవడం గమన్హారం. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయంలో నోరు తెరిచి ఉన్న బోరును అధికారులు అలాగే గాలికొదిలేశారు. జరుగరాని ఘోరం ఎదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని గమనించిన వారు ప్రశ్నిస్తున్నారు. చేతులు కాలకా ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం జరిగాక ఎంతో హడావుడి స్పష్టించే అధికారులు ముందస్తుగానే నోరు తెరుచుకున్న బోర్‌వెల్‌లను మూసివేసే చర్యలు చేపడితే బాగుంటుందని పేర్కొంటున్నారు. అలాగే, పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో, కిష్ఠాపూర్ తదితర ప్రాంతాల్లో పనిచేయని బోర్‌వెల్‌లను ఎలాంటి చర్యలు చేపట్టకుండా నోరు తెరుచుకుని ఉన్న అలాగే, నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదం జరుగుక ముందే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.