రంగారెడ్డి

బోర్ల కోసం తీసిన గుంతలతో జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 24: నీళ్లు పడకుండా ఖాళీగా ఉన్న బోర్ బావులు.. చిన్నపిల్లల పాలిట మృత్యు గుహల్లా మారుతున్నాయి. ప్రస్తుతం చేవెళ్ల సంఘటనే కాకుండా గత నాలుగేళ్లుగా ఎక్కడో ఓ చోట బోర్‌బావుల్లో చిన్నారులు పడుతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా సంఘటనలు జరిగినపుడే మాత్రమే స్పందిస్తున్న ప్రజలు.. ఆ తర్వాత వాటిని గురించి మర్చిపోతున్నారు. కనీసం తాము నివసిస్తున్న పరిసరాల్లో అలాంటివేమైనా ఉన్నాయా అని కనీసం ఆరా తీయడంలేదు. బోర్ బావుల కోసం తీసిన గుంతల పట్ల అప్రమత్తంగా ఉండటం కంటే ముందే, ఆలా వాటిని గాలికి వదిలేయకుండా నీరు పడకుంటే బోర్ వేసిన వాహనంతోనే మూయించాలని పలువురు సూచిస్తున్నారు.
ముందే స్పందించడం మంచిది
ఏదైనా సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే రాకముందే స్పందించడం మంచిదని వికారాబాద్ జిల్లా ఎస్పీ టి.అన్నపూర్ణ అన్నారు. చేవెళ్ల మండలంలో చిన్న పాప ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు వాడకంలోలేని బోరు బావిలో పడిపోగా, రక్షించేందుకు అధికారులు తీవ్రంగా కష్టపడుతున్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. జిల్లాలోని గ్రామాల్లో ఏవైనా వాడకంలో లేని బోరు బావులు ఉన్న ఎడల వెంటనే వాటిని మూయించాలని జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. ఎవరైనా యజమానులు నిరాకరిస్తే తమకు తెలియజేయాలని ఎస్పీ హితవు పలికారు.