కృష్ణ

పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 24: విఎంసికి వ్యతిరేకంగా దాఖలు చేసిన కోర్టు కేసుల పరిష్కారంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విఎంసి కమిషనర్ జె నివాస్ పేర్కొన్నారు. ఈసందర్భంగా శనివారం ఉదయం తన ఛాంబర్‌లో 103 సమస్యల పరిష్కారంతోపాటు కోర్టు వివాదాల కేసుల పరిష్కారాలపై సమీక్షించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకొని కౌంటర్స్ దాఖలు చేయడంలో ఎటువంటి అలక్ష్యం వద్దని, ఏదైనా అత్యవసర కేసుల విషయంలో ప్రత్యేక చొరవ చూపి ఆయా సమాచారాన్ని తనకు నివేదించాలన్నారు. ఎంఎస్‌సి ద్వారా కంటెమ్ట్ కేసులకు సంబంధించి హైకోర్టులో సమర్పించాల్సిన కౌంటర్స్‌ను తక్షణమే దాఖలు చేయాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించిన పెరావైజ్ రిమార్కులను తక్షణమే లీగల్ సెల్‌కు సమర్పించాలని నివాస్ ఆదేశించారు. అలాగే 103 సెల్ ద్వారా వచ్చే ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. ఈ సమావేవంలో ఎసిజి చంద్రశేఖర్, డిసిఆర్ సుబ్బారావు, మేనేజర్ ఎ నాగకుమారి తదితరులు పాల్గొన్నారు.