కృష్ణ

ఆధార్ అనుసంధాన ఎరువుల పంపిణీలో జిల్లా ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: జిల్లాలో రైతులకు సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ, ఆధార్ అనుసంధాన ఎరువుల పంపిణీ అంశాలలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని కలెక్టరు బి.లక్ష్మీకాంతం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ సకాలంలో అందించి అధిక దిగుబడుల సాధనకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీకి సంబంధించి నూరుశాతం 76.723 సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేసి రాష్ట్రంలోనే ప్రథమస్థానం పొందినట్లు కలెక్టర్ తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు 19 వేల మెట్రిక్ టన్నుల పంపిణీ లక్ష్యం కాగా 13 వేల 900 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచామన్నారు. ఎరువుల పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు చేపట్టిన ఆధార్ అనుసంధానంతో కూడిన ఎరువుల పంపిణీ విధానంలో జిల్లాలో 968 రిటైలర్స్ ద్వారా ఎరువులు పంపిణీ చేసి రాష్ట్రంలో మొదటిస్థానం పొందినట్లు కలెక్టర్ తెలిపారు. గృహ నిర్మాణం శాఖ ద్వారా లబ్ధిదారులకు నిర్మిస్తున్న గృహాలు, పంచాయతీరాజ్ ద్వారా గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల నూతన భవనాలు, గ్రామాల్లోని రహదార్ల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన జియో ట్యాగింగ్ విధానం అమల్లో 5908 జియో ట్యాగింగ్ చేసి రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు.