సాహితి

ఆత్మీయబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్టే మనిషి ఊపిరి
మనిషి కావాలి చెట్టు కాపరి
మొక్కకు జల వనరుల జవసత్వమందించు
విరుల హొయలతో వనకన్య దర్శనమిచ్చు
చెట్టుకు చేయూతనిచ్చి సంరక్షించు
హరిత వనాలలో హాయిగా విహరించవచ్చు
మొక్కలను చిదిమి వృక్షాలను నరికితే
మానవ మనుగడ ప్రశ్నార్థకమే
నగరాలు ఎడారులైతే నిలువనీడ కరువే
తులసి తీర్థానికీ తపించి ‘పోవడమే’
ప్రతిఫలాపేక్ష నాశించని ప్రకృతి
మనిషికందించు మధుర ఫల రసానుభూతి
ఆరోగ్య పరిరక్షణా సుధాస్రవంతి
ప్రకటిస్తూ చెట్టుకి కృతజ్ఞత
ప్రాణాధికంగా ప్రేమించడమే విజ్ఞత
సుప్రభాత సేవలో చెట్లు పులకించాలి
వన మహోత్సవం నిత్యకృత్యమై విరాజిల్లాలి
నందన వనాల నగర శోభ జీవ ఉత్తేజం
సుందర వనాల అనుబంధం ఉత్సాహభరితం.

- ఇంద్రగంటి నరసింహమూర్తి