భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! 67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ నీరు త్రాగి దాహం తీర్చుకోవటానికి పెద్ద పెద్ద ఏనుగులు, ఇతర వన్యమృగాలు వస్తుంటాయి కనుక భక్తులు ఇక్కడ ఎక్కువసేపు ఆగరు! రాత్రుళ్లు బస చేయరు! ఇక్కడ నుండి కొద్ది దూరంలో ప్రవహిస్తున్న పంబానది కనిపిస్తుంటుంది! భక్తులు ఉత్సాహంగా ఆ వైపు నడక సాగిస్తారు!
అడవి మార్గాన కాలినడకన వచ్చే యాత్రికులు పంబానది చేరడంతో మార్గంలో పడిన కష్టాలను మరిచి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు! కష్టంతో కూడినదే అయినా ఇప్పటికీ ఈ మార్గాన చాలామంది భక్తులు పంబా నదీ తీరాన్ని చేరుకుంటున్నారు. అడవి మార్గాన సుమారుగా 50-60 కి.మీ నడవవలసి వుంటుంది! అడవి మార్గాన కాకుండా వాహనాలమీద ప్రక్కగా వుండే రహదారి మార్గాన (చిన్నపాదం) కూడా భక్తులు పంబానదీ తీరాన్ని చేరి ఆ రోజుకు అక్కడ విశ్రమిస్తారు! (అక్కడ నుండి 6 కి.మీ మార్గం నడిచి కొండ ఎక్కి సన్నిధానం చేరుకుంటారు)
పంబానది:పంబ అంటే పాపవినాశిని అని అర్థం! దక్షిణదేశపు గంగానదిగా ప్రఖ్యాతిగాంచింది ఈ పంబానది! ‘దక్షిణ గంగ’ అని కూడా పిలువబడుతున్నది. ఔషధ మూలికల సారంతో ప్రవహించే ఈ నదీ జలాలలో స్నానం శరీరానికి, మనసుకు శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది! పాపవినాశిని గనక భక్తులు ఈ నదీ స్నానం చేయడంవల్ల వారిలోని రజోతమోగుణాలు నశిస్తాయనీ, సాత్విక గుణం మాత్రం కలిగి వుంటారనీ చెప్పబడింది! శ్రీరామచంద్రుడు కూడా వనవాస కాలంలో ఈ నదిలో స్నానం ఆచరించినట్లు స్థల పురాణంలో చెప్పబడింది! అందుకు గుర్తుగా పంబా తీరాన రాతి శ్రీరామ పాదాలు దర్శనమిస్తాయి!
అయ్యప్పస్వామి శిశువుగా పంబళరాజుకు పంబాతీరానే్న దొరకటంవల్ల పంబా తీర దర్శనం, పంబా స్నానం పవిత్రంగా భావించబడుతున్నాయి!
పంబాతర్పణం:అయ్యప్పస్వామి సైన్యాలకు, ఉదయనుడి సైన్యాలకు యుద్ధం జరిగినప్పుడు రెండు ప్రక్కల ఎందరో సైనికులు మరణించడం జరిగింది! చనిపోయినవారికి పంబా తీరానే పిండప్రదానం కావిస్తారు మిగిలిన సైనికులు అయ్యప్ప చెప్పడంతో! పంబా నీటితో తర్పణాలు విడవటం, పిండ ప్రదానాలు చేయడంవల్ల పితరులకు సద్గతులు కలుగుతాయి. అనంతమైన పుణ్యం లభిస్తుంది! భక్తులు తమ పూర్వీకులకు పిండప్రదానాలు కావిస్తారు, తర్పణాలు విడుస్తారు! పంబానదిలో స్నానం ఆచరించి పవిత్రులౌతారు! దీక్షాకాలంలో ధరించిన నల్లవస్త్రాలు విడిచి కొంతమంది సత్వగుణానికి చిహ్నమైన తెల్లని వస్త్రాలు ధరిస్తారు!
పంబా సద్ది: స్నానం, తర్పణాలు ఇవ్వడం పూర్తయిన తర్వాత ఈ తీరాన ‘పంబాసద్ది’ అనే విందు భోజనం తయారుచేస్తారందరూ కలిసి! ఇక్కడ కాయగూరలు, వంటసామగ్రి కట్టెలు, విస్తరాకులు మొదలైన సరుకులు అమ్మకానికి తీసుకువస్తారు ఆ ప్రాంతంవాళ్లు! వాటిని కొనుక్కుని విందుభోజనం తయారుచేస్తారు! ముందుగా ఇరుముడులు వుంచిన స్థలంలో ఒక విస్తరి వేసి అందులో వడ్డిన పదార్థాలన్నిటిని వుంచి అయ్యప్పస్వామికి నివేదన చేస్తారు! అందులో స్వామి భోజనం ఆరగించుతారని భక్తుల విశ్వాసం! భక్తులందరూ స్వామి నామస్మరణ చేస్తూ తృప్తిగా భుజించిన తరువాత స్వామి కోసం వేసిన విస్తరాకును వేలం వేస్తారు! ఆరోగ్యం, సంతానం, ఐశ్వర్యం మొదలైన కోరికలు తీరడం కోసం భక్తులందరూ ఉత్సాహంగా వేలంపాటలో పాల్గొంటారు! అందరికంటే ఎక్కువ పాడిన భక్తుడు ఆకును స్వంతం చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరగించటం జరుగుతుంది! తరువాత ఆ ఆకును భక్తిశ్రద్ధలతో తలమీద వుంచుకుని పంబాతీరానికివచ్చి ఆకును నదిలో విడిచిపెట్టడంతో పంబాసద్ది కార్యక్రమం పూర్తవుతుంది!
పంబావిళక్కు:విళక్కు అంటే దీపం అని అర్థం! రాత్రి కాగానే చిన్న ఆకు దొనె్నలలో దీపాలు వెలిగించి నదిలో వదలిపెడతారు! దీప జ్యోతులు మెల్లగా సాగిపోతూ నయనానందకరంగా కనిపిస్తాయి! ఈ దీపాలు వదిలే కార్యక్రమాన్ని కనె్నస్వాములు చేస్తారు!
పంబా నదీ తీరంలో వున్న గణపతి, ఆంజనేయస్వాముల గుడులను దర్శించి కొబ్బరికాయలు కొట్టి యాత్ర నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించి రాత్రి పంబా తీరంలో విశ్రమిస్తారు!
నాలుగవ రోజు ప్రయాణం:ఉదయానే్న బయలుదేరి భక్తులు నీలిమల మార్గాన అప్పాచిమేడు చేరుకుంటారు! ఇక్కడినుండి శబరిగిరిమీదకు ఎక్కటం ప్రారంభిస్తారు! ముందుగా గిరికి రెండువైపులా వున్న లోయలలోకి భూతగణాల తృప్తికోసం బియ్యపు వుండలు విసురుతారు! ఆ విధంగా చేయడంవల్ల అవి యాత్రకు ఆటంకం కలిగించవని భక్తుల విశ్వాసం!
శబరిపీఠం: మార్గంలో ముందుగా వచ్చేది శబరిపీఠం! ఈ ప్రాంతంలోనే అయ్యప్ప భక్తురాలు స్వామిని తపస్సుతో సాక్షాత్కరింపజేసుకుని, దర్శించి మోక్షప్రాప్తిని పొందింది! తర్వాతికాలంలో పంబలరాజ వంశీయులు
ఇక్కడ శబరి పేరుమీద విద్యాపీఠాన్ని ఏర్పర్చటం జరిగింది! ఈ పీఠాన్ని దర్శించి ముందుకు సాగి ‘శీరం గుత్తి’ అనే ప్రాంతాన్ని చేరుకుంటారు!
-ఇంకాఉంది

-డా. టి. కళ్యాణీసచ్చిదానందం