అదిలాబాద్

కడెం ప్రాజెక్టును సందర్శించిన హైకోర్టు జడ్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జూన్ 25: నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యం దంపతులు ఆదివారం పర్యటించారు. కడెం ప్రాజెక్టు ప్రధానకాలువ నుండి ప్రాజెక్టు రోడ్డుపై హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యం దంపతులు, నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇలంబరిది కాలినడకన నడుస్తూ కడెం జలాశయంను, ప్రాజెక్టు వరదగేట్లను గోదావరిలో వెళ్తున్న నీటిని పరిశీలించారు. కడెం ప్రాజెక్టు కింద ఎన్నివేల ఎకరాల పంటలకు ప్రాజెక్టు సాగునీరు అందుతున్న విషయంపై న్యాయమూర్తి జిల్లా కలెక్టర్‌తో ఆరాతీశారు. ఆయకట్టు కింద దాదాపు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతున్న విషయాన్ని, ప్రాజెక్టు వరదగట్లు, పలు ప్రాజెక్టుల విషయాలపై జిల్లా కలెక్టర్ ఇలంబరిది, న్యాయమూర్తికి వివరించారు. అనంతరం కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువ అయిన ఎడమ కాలువ వద్దకు వెళ్లి అక్కడ పర్యాటక ప్రాంతంగా ఉండడంతో న్యాయమూర్తి దంపతులు కాలువ దగ్గర కలెక్టర్‌తో కలిసి ఫోటోలు దిగారు. అలాగే కలెక్టర్ ఇలంబరిది న్యాయమూర్తి దంపతులతో సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత న్యాయమూర్తి దంపతులు, కలెక్టర్ ఇలంబరిది కలిసి కడెం పర్యాటకశాఖ బోటింగ్ పాయింట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జలాశయంలో బోటు విహారంచేస్తూ ప్రాజెక్టు, ప్రకృతి అందాలను తిలకించారు. అనంతరం హరిత రిసార్ట్‌లో కొద్దిసేపు సేదతీరుతూ ఇక్కడి నుండి నిర్మల్‌కు వెళ్లారు. వారివెంట కలెక్టర్ ఇలంబరిది, ఆర్డివో ప్రసూనాంభ, తహశీల్దార్ నర్సయ్య, ఎఫ్‌ఆర్‌వో రాథోడ్ రమేష్, సిఐ పెద్దన్నకుమార్, పెద్దూర్ ఎఫ్‌ఎస్‌వో గీత, ఎస్సై బాలకృష్ణ తదితరులు ఉన్నారు.