నల్గొండ

వర్గీకరణకై పోరాటానికి సిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 25: ఎస్సి రిజర్వేషన్ వర్గీకరణ సాధనకై పోరాటాలకు సిద్దం కావాలని ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఆదివారం స్థానిక గాంధీపార్క్‌లో ఎస్సి రిజర్వేషన్‌ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌చేస్తూ తెలంగాణ, ఏపిలకు చెందిన మాదిగ సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే 100రోజుల్లో ఎస్సి వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు జూలై 7న బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరుగుతుందని ఆగస్టులో ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. టిఎమ్మార్పి ఎస్ నాయకులు తప్పెట్ల శ్రీరాములు, దండు వీరయ్యమాదిగ, ఇటుక రాజు, సింగిరెడ్డి పరమేష్‌మాదిగ, కొండగడుపుల సూరయ్య మాదిగ, పుట్ట శ్రవణ్‌కుమార్ మాదిగ, వంగాల విజయ్, బొడ్డు మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.