మెదక్

సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూన్ 25: సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి తెలిపారు. ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని ఆమె ప్రజలను విజ్ఞప్తి చేశారు. వాడుకలో లేని పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు, తొట్టు ఇంటిపై, పరిసరాల్లో లేకుండా చూసుకోవాలన్నారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కరపత్రాలను జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అమర్‌సింగ్ నాయక్ ఆదివారం విడుదల చేశారు. ఓవర్ హెడ్ ట్యాంక్‌లు, సంప్‌లు, డ్రమ్‌లు, నీటి తొట్లమీద మూతలు పెట్టాలన్నారు. ఇంటి పైకప్పులపైన, టెర్రస్లు, సన్ షెడ్‌లపై నీరు నిలువకుండా చూసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం పొడి దినంగా పాటించి నీటి నిలువలు అన్ని శుభ్రపరిచి ఆరబెట్టి తిరిగి నింపుకోవాలన్నారు. ఒక సారి వాడి పడవేసిన ప్లాస్టిక్ సంచులు, కప్పులు, గ్లాసులను ఇంటి ముందు మురికి కాలువలో వేయకూడదని వారు సూచించారు. సెప్టింక్ ట్యాంక్‌ల గాలికొట్టాలకు పైలాన్ జాలీ కట్టుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, గుమ్మాలకు జాలీ, మెస్ అమర్చాలని జిల్లా కలెక్టర్, డియంహెచ్‌ఓ సూచించారు. దోమ తెరలలో పడుకోవడం అలవర్చుకోవాలన్నారు. గ్రామాల్లోని వీధులన్ని శుభ్రపరిచి మురుగు కాలువలలోని చెత్త, చెదారం తొలగించాలన్నారు. వర్షాలకు ముందు, తరువాత మురికి కాలువల్లో పూడిక తీత చేపట్టాలని, నీరు పారుతుండేలా చూడాలన్నారు. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు, ప్రజలలో అవగాహణ కల్పించాలని వారు కోరారు. వ్యాధులు ప్రభలినప్పుడు స్థానిక ఆరోగ్య సిబ్బందికి వెంటనే తెలియజేసి సలహాలు, సూచనలు పాటించాలన్నారు. మలేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించడం, రక్త పరీక్షల ద్వారా నిర్దారణ, పూర్తి చికిత్సకు తగిన ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. అనుమానిత జ్వర పీడుతులకు డెంగ్యూ నిర్దారణ పరీక్ష చేస్తారని వారు తెలిపారు. ఆరోగ్య శిబిరాల నిర్వాహణ, అవగాహణ సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలందరి వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తపూతల సేకరణకు, చికిత్సలు సౌకర్యాలు అందుబాటులో ఉంచామని వారు తెలిపారు. వ్యాధి ప్రభలిన చోట దోమల నియంత్రణ మందులు చల్లడం, పొగ పెట్టడం జరుగుతుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్య కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ భారతి హొళ్లికేరి, డియంహెచ్‌ఓ అమర్‌సింగ్ తెలిపారు.