మెదక్

సామరస్యానికి ఫ్రతీక రంజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 25 : ముస్లింల పవిత్ర పర్వదిన మైన రంజాన్ పండుగ పురస్కరించుకొని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు జిల్లా ప్రజలకు, ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ రంజాన్ పండుగ, పవిత్రతకు, త్యాగానికి చిహ్నామని, పండుగను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్నారు. సేవా దృక్పథ, భక్తి ప్రవృతులు, సోదరభావాలు, మతసామారస్యానికి చాటిచెప్పే పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకోవాలన్నారు. రంజాన్ పండుగను మన పండుగగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. మైనార్టీల అభివృద్ధికి కృషిచేస్తుందని, ముస్లిం సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రంజాన్ మాసమంతా నిష్టతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.