మహబూబ్‌నగర్

అపర భగీరథుడు కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, జూన్ 25: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అపర భగీరథుడని దేవరకద్ర ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు సమీపంలో గల తీలేర్ పంప్ హౌజ్‌ను ప్రారంబించి నీటిని వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గంలో సాగునీరు అందించడం లక్ష్యంగానే ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేయడం, కర్వెన రిజర్వాయర్‌ను 19.5టిఎంసిలతో రూ.35.250కోట్లు నిధులను కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. దీంతో వచ్చే ఎడాదికే మొదటి ప్రాధాన్యతగా 125కిలోమిటర్ల దూరంలో నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గంలోరైతు పండించే ప్రతిసెంట్‌భూమికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ఉన్నామన్నారు. రైతులు పండించే పంటలకు ముందస్తుగా ప్రతిమండల కేంద్రాలలో ఎరువులు, విత్తనాలను నిలువ పెట్టట్టడం జరిగిందని, రైతుకు పంట పండించేందుకు పెట్టుబడిగా ఎకరాకు రూ.4వేల చొప్పున రెండుపంటలకు రూ.8వేల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరుగుతుందన్నారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను వచ్చే ఎడాది 24గంటల విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి ఇవి గోపాల్, మార్కెట్ కమిటి చైర్మన్ జట్టినరసింహారెడ్డి,టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్‌యాదవ్, నాయకులు నరేంధర్‌రెడ్డి,రాములు,స్వామినాథ్ తదితరులు పాల్గొన్నారు.