నిజామాబాద్

ఆరోగ్యమే మహాభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూన్ 25: ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ధర్మపురి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం హర్షించదగ్గ విషయమని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరం నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తూనే, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో ధర్మపురి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్ మాట్లాడుతూ, మొదటిసారిగా చిన్నజీయర్‌స్వామి వారి ఆశీస్సులతో మాజీ మేయర్ సంజయ్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తాడని, ఆరోగ్యమే మహాభాగ్యమని, అందువల్ల ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఇక ఉచిత వైద్య శిబిరానికి హైదరాబాద్‌లోని గ్లోబల్, కేర్ ఆసుపత్రులతో పాటు నిజామాబాద్‌లోని పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొని, రోగుల వైద్య చికిత్సలు అందించిన డాక్టర్లను డి.శ్రీనివాస్ అభినందించారు. శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, రోగులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవడం ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై ఉన్న శ్రద్దకు అద్దం పడుతోందన్నారు. మాజీ మేయర్ సంజయ్ మాట్లాడుతూ, ఇంటింటికి ఆరోగ్యంపై సర్వేలు చేస్తున్నప్పుడు షుగర్, బిపి తదితర వ్యాధులపై ప్రజలు స్పందించినందునే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని చిన్నజీయర్‌స్వామి ఆశీస్సులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం రాజ్యసభ్యుడు డి.శ్రీనివాస్, వైద్య శిబిరంలో రోగులకు వైద్య సేవలు అందించిన డాక్టర్లను ఘనంగా సన్మానించారు. ఈ వైద్య శిబిరంలో ఐఎంఎ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌సోరి, డాక్టర్ రవీందర్‌రెడ్డి, డాక్టర్ జలగం తిరుపతిరావు, అజ్జు శ్రీనివాస్, కేర్, గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్లు, కార్పొరేటర్లు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం డి.శ్రీనివాస్ నగరంలోని ఖలీల్‌వాడిలో నూతనంగా ఏర్పాటు చేసిన రష్ తిరుమల మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.్భపతిరెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత, నిర్వాహకులు ఆర్.్భస్కర్‌రాజ్, లింగం, కార్పొరేటర్లు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.