కరీంనగర్

స్మార్ట్‌సిటీ ప్రతిష్టను దిగజార్చవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 25: కొద్దిపాటి నిధులతోనే కరీంనగర్ నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పట్టించుకోని నగరపాలక సంస్థ పాలకవర్గం స్మార్ట్ సిటీ పథకం కింద వచ్చే భారీ నిధులతో చేపట్టే పనుల్లో అదే మాదిరిగా వ్యవహరిస్తే స్మార్ట్ సిటీ ప్రతిష్ట దిగజారడమే కాకుండా నగర ప్రజల ముందు నగుబాటు కాకతప్పదని టిడిపి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హెచ్చరించారు. ఆదివారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌సిటీగా ప్రకటించిన ఎన్డీఏ ప్రభుత్వానికి, సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. స్మార్ట్ సిటీగా ఎంపికైన నగరానికి ఏడాదికి రూ.200కోట్ల చొప్పున కేంద్రం నిధులు విడుదల చేయనున్నదని, ఈ నిధులతోనైనా నగర రూపురేఖలు మారుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ నిధులు సక్రమంగా వినియోగించాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణా లు పాటించేలా చూడాలని, ప్రమాణాలకు తిలోదకాలిచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ నగరాభివృద్ధికి ఇచ్చిన హామీలన్నీ నీటి మూ టలుగానే మారాయని విమర్శించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నకిలీ విత్తన విక్రయాలకు కల్లెం వేయడంలో సర్కార్ విఫలమైందన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని చెప్పడమే తప్పా ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా కూ డా కేసులు నమోదైన దాఖలాలు లేవని అన్నారు. ఇప్పటికైనా నకిలీ విత్తన విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయరమణారావు డిమాండ్ చేశారు. టిడిపి నాయకులు తాజోద్దీన్, కల్యాడపు ఆగయ్య, ఆడెపు కమలాకర్, ఔదుర్తి విజయ్ కుమార్, గాజె రమేష్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.