వరంగల్

కార్మికుల సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జూన్ 25: కార్మిక సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. నర్సంపేటలోని రెడ్డి కల్యాణ మండపంలో సిఐటియూకు చెందిన 2వేల మంది కార్యకర్తలు టిఆర్‌ఎస్‌కెవిలో మంత్రి తుమ్మల సమక్షంలో ఆదివారం చేరారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశానికి టిఆర్‌ఎస్‌కెవి రూరల్ జిల్లా ఇన్‌చార్జి గోనె యువరాజు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఇప్పటి వరకు అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, విఏవోలు తదితర 14 రంగాలకు చెందిన కార్మికులకు కనీస వేతనాలను ప్రభుత్వం పెంచిందని చెప్పారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించనున్నట్టు హామీ ఇచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ అహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణం సిఎం కెసిఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ప్రతి ఒకరూ గమనించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపి అజ్మీరా సీతారాంనాయక్, టిఆర్‌ఎస్‌కెవి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, రాష్ట్ర ఇన్‌చార్జి రూప్‌సింగ్, మాధవి, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య, కొల్లూరి లక్ష్మీనారాయణ, నల్లా భారతి, పాలడుగుల రమేష్, నిర్మల, మంజుల, రజిత, స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.