వరంగల్

రూ.4లక్షల విలువ గల రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జూన్ 25: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నుండి కాకినాడకు అక్రమంగా తరలుతున్న నాలుగు లక్షల రూపాయల విలువ గల రేషన్ బియ్యాన్ని ఆదివారం తెల్లవారుజామున పట్టుకున్నట్టు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి చెప్పారు. గూడూరు పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు. గూడూరు మండలంలోని అప్పరాజుపల్లి, రాజన్‌పల్లి గ్రామాల మీదుగా డిసిఎంలలో కాకినాడకు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయనే పక్కా సమాచారం మేరకు డిఎస్పీ రాజమహేంద్ర నాయక్, సిఐ రమేష్ నాయక్, ఎస్సై రామారావులు శనివారం అర్ధరాత్రి కాపు కాసి రెండు డిసి ఎంలను పట్టుకున్నారని చెప్పారు. పట్టుకున్న రెండు డిసిఎంలలో 225 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నాయని, వీటి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయల పైచిలుకు ఉంటుందని అన్నారు. కేసముద్రంకు చెందిన శ్రీ్ధర్, అప్పరాజుపల్లికి చెందిన వేముల ఉపేందర్‌లు సమీప గ్రామాలకు చెందిన రేషన్ డీలర్ల నుండి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్నట్టు తమ విచారణలో నిర్ధారణ అయిందన్నారు. డిసిఎంలలో ఉన్న కొండపల్లి రవి, బూరుగుండ్ల అశోక్, గుగులోతు రాజులు ఈమేరకు రేషన్ బియ్యం వివరాలను వెల్లడించారని తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న శ్రీ్ధర్, ఉపేందర్‌లతో పాటు రేషన్ డీలర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రెండు డిసి ఎంలను సీజ్ చేసినట్లు తెలిపారు. కేసముద్రం మండలంలోని కోమటిపల్లి, ఇంటికనె్న, గూడూరు మండలంలోని రాజన్‌పల్లి, అప్పరాజుపల్లి రేషన్ డీలర్ల వద్ద శ్రీ్ధర్, ఉపేందర్‌లు రేషన్ బియ్యం కొనుగులు చేసినట్టు అదుపులోకి తీసుకున్న ముగ్గురు చెప్పారని అన్నారు. పక్కా సమాచారం మేరకు కాపుకాసి రేషన్ బియ్యాన్ని డిసిఎంలతో సహా పట్టుకున్న డిఎస్పీ రాజమహేంద్రనాయక్, సిఐ రమేష్ నాయక్, ఎస్సై రామారావు, సిబ్బందిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. కాగా మహబూబాబాద్ పట్టణంలోని మరో రెండు క్వింటాళ్ల పిడియస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిసింది.