వరంగల్

మహాగాయత్రి దేవాలయ భూమి కబ్జాకు యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూన్ 25: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న మహిమాన్విత మహిమ గల పురాణ కాలం నాటి శ్రీ మహాగాయత్రి దేవి ఆలయ భూకబ్జా చేసిన వారిపై పిర్యాదు చేసుకోవాలని కోరుతూ ఆలయ వ్యవస్థాపక ట్రస్ట్ అధ్యక్షుడు వంకొజు జలేంద్రాచారి ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని నర్సంపేట రహదారిలో పూర్వకాలం నుండి శ్రీ మహాగాయత్రి దేవాలయం ఉంది.
ఈ దేవాలయానికి 10ఎకరాల భూమి ఉంది. ఇటీవలే మహబూబాబాద్ జిల్లా కేంద్రం కావడంతో భూములకు ధరలు పెరుగడంతో కొందరు భూకబ్జాదారులు ఆలయ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేయగా అడ్డుకున్నందుకు తనపై హత్యాయత్నం చేశారని పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. శనివారం 8గంటలకు దేవాలయం వెళుతుండగా ఆలయం వద్ద ఉన్న రైల్వే ఉద్యోగి, ఆయన కుమారుడు మహేందర్‌తోపాటు మరికొంతమంది కలసి ప్రొక్లయనర్‌తో దేవాలయ భూమి కబ్జా చేస్తూ అక్రమ కట్టడాలు చేస్తుండగా అడ్డుకున్నందుకు తనపై దౌర్జన్యం చేయడంతోపాటు అడ్డువస్తే చంపేస్తానని బెదిరించారని పోలీస్‌లకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. భూకబ్జాదారుల నుండి తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని పోలీస్‌లను కోరారు.