వరంగల్

ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుతో ఉపాధ్యాయులకు పండగే పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 25: రెండు దశాబ్దాల కాలంగా ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై కొనసాగుతున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడటంతో ఉమ్మడి సర్వీసు నిబంధనలతో బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయని ఉపాధ్యాయులు, సంఘాలు చెబుతున్నాయి. ప్రత్యక్షంగా ఉపాధ్యాయ వర్గానికి పదోన్నతులతో లబ్ధి చేకూరుతుండగా, ఏళ్ల తరబడిగా పోస్టులు భర్తీకాకుండా ఇన్‌చార్జ్‌ల పర్యవేక్షణతో పాఠశాల విద్యాశాఖలో తిష్టవేసిన అనేకకానేక సమస్యలకు మోక్షం లభించనుంది. వేలాదిమంది ఉపాధ్యాయులకు వివిధ స్థాయిలో పదోన్నతులు లభించనున్నాయి. పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే ఇది కీలకపరిణామం కానుందని, పలు అంచెల్లో విద్యారంగం పరిపుష్టం అవుతుందని ఉపాధ్యా సంఘాలు చెబుతున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పర్యవేక్షించే అధికారం కలిగిన ఎంఈవో పోస్టులతోపాటు ఉన్నత పాఠశాలలను పర్యవేక్షించే ఉపవిద్యాధికారి పోస్టులు భర్తీకి అవకాశం ఏర్పడి పర్యవేక్షణ సులువుకానుంది. ఉపాధ్యాయ శిక్షణనిచ్చే విద్యాసంస్థలు డైట్, బిఎడ్ కళాశాలల్లో అధ్యాపకులు కొలువుదీరనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోను అధ్యాపకులను పదోన్నతుల ద్వారా భర్తీచేసే అవకాశం ఏర్పడింది. ఏకీకృత సర్వీస్ నిబంధనలకు రాష్టప్రతి ఆమోదముద్ర పడి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనందున తదుపరి కార్యాచరణపై విద్యాశాఖ దృష్టిసారించనుంది. 505, 538 జీవోల రద్దుతో మండల విద్యాధికారుల నియామకాలు నిలిచిపోయాయి. మండలస్థాయిలో విద్యావ్యవస్థను పర్యవేక్షించే పోస్టులు ఖాళీగా ఉండి సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో మండలాల్లో విద్యావ్యవస్థ గాడితప్పిందనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో 450కిపైగా ఎంఇఓ, 400వరకు డైట్ కళాశాలల అధ్యాపకులు, అరవై ఉప విద్యాధికారి పోస్టులు, మూడువేల దాకా జూనియర్ కళాశాలల లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 51మండలాలకు కేవలం ఇద్దరు మాత్రమే రెగ్యూలర్ ఎంఇఓలు విధులు నిర్వహిస్తుండగా 49పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలులోకి రానుండడంతో ఈ పోస్టులు భర్తీకి అవకాశాలు ఏర్పడుతున్నాయి.
కీలకమైన జోనల్ పోస్టుల రద్దు
ఉపాధ్యాయ సర్వీసు నిబంధనలపై అడ్డంకులు తొలగి కొత్త సర్వీస్ రూల్స్ అమల్లోకి రానున్న తరుణంలో జోనల్ వ్యవస్థ రద్దు వ్యవహారం కీలకంగా మారనుంది. రాష్ట్రప్రభుత్వం జోనల్ వ్యవస్థను రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటిదాకా జోనల్‌స్థాయి పోస్టులైన హెచ్‌ఎం, ఎంఇఒ, డిప్యూటీ డిఇఓ, డైట్ లెక్చరర్ పోస్టులు ఏ ప్రాతిపదికన భర్తీచేయాలనే విషయమై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జోనల్ విధానంపై స్పష్టత వస్తేనే ఈ విధానంలో రూట్ క్లియర్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు జిల్లాకేడర్ పోస్టులుగా ఉండగా మిగిలిన పోస్టులన్నీ జోనల్ కేడర్‌లో ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం జిల్లా, రాష్టస్థ్రాయిల్లో రెండురకాల కేడర్ పోస్టులు మాత్రమే ఉంటాయని చెబుతున్న క్రమంలో ఆయా పోస్టులను ఈ రెండు కేటగిరిల్లోనే సర్దుతూ తాజా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసినందున త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నుండి డిమాండ్ వినవస్తోంది. గెజిటెడ్ అధికారులను రాష్ట్ర కేడర్‌కు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులను జిల్లా కేడర్‌కు మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నెల 29లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి 371(డి)కి సవరణలు చేయించాలని కోరుతున్నారు.
స్కూల్ అసిస్టెంట్‌లకు హెడ్మాస్టర్లుగా, ఎంఇఓ, డైట్, జూనియర్ లెకర్చర్లుగా పదోన్నతి లభించనుంది. ప్రధానోపాధ్యాయులకు డిప్యూటీ ఇఓతోపాటు ఎంఇఓలుగా మారే వెసులుబాటు లభించనుంది. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్ రానుంది. ఒక్కదానితో మరొకటి ముడిపడి ఉన్న ఈ వ్యవహరం సాఫీగా సాగితే రాష్టస్థ్రాయిలో 18వేల మందిదాకా ఉపాధ్యాయులు పదోన్నతులతో పండుగ చేసుకోనున్నారు.
దసరా సెలవులకై నిరీక్షణ
ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియను దసరా సెలవుల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇవ్వటంతో దసరా పండుగ రాకకోసం ఉపాధ్యాయవర్గాలు ఎదురుచూస్తున్నాయి. జిల్లా, రాష్టస్థ్రాయి పోస్టుల కేడర్ గుర్తింపు అనంతరం కొత్త సర్వీసు నిబంధనలు రూపొందించడానికి సమయం పడుతున్నందున ఈ ప్రక్రియ ఆలస్యం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విద్యా సంవత్సరం ఇప్పటికే ఆరంభమైనందున దసరా సెలవులనాటికి సగంలోకి చేరుతుందని అప్పుడు పదోన్నతులు ఇచ్చినప్పటికీ కొత్త కొలువుల్లో చేరికపై కొంత కసరత్తు జరిగి విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. సెలవులు ఎప్పుడు వస్తాయా పదోన్నతులు ఎప్పుడు ఇస్తారా అని ఉపాధ్యాయులు ఆత్రుతతో, ఆశతో నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సర్వీసులపై సంక్షోభం సమసిపోగా ఇప్పటికిప్పుడు సీనియర్‌లుగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకే పదోన్నతులు అధికంగా వస్తాయని, అయితే భవిష్యత్తులో ఉన్నతస్థాయి పోస్టుల్లో పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు అవకాశాలు దక్కుతాయని చెప్పుకుంటున్నారు.