ఖమ్మం

ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, జూన్ 25: పదిహేడేళ్ళ వయసులో విడిపోయి నాలుగున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ కలుసుకున్న మిత్రులు, ఉపాధ్యాయులు పరస్పరం పలకరింపులతో అనందోత్సాహాలలో మునిగి పోయారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకొని సంబరపడ్డారు. తమ తోటి మిత్రుల ఉన్నతికి పులకించిపోయారు. 1970కి చెందిన గార్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్థానిక వర్తక సంఘ భవనంలో శనివారం జరిగింది. నలుభై ఏడు సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులంతా ఉత్సాహంగా పండుగ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య పాల్గొని ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరు అత్మీయత అనుబంధంతో కలిసి మెలసి ఉండాలని, తమ శేషజీవితం ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలని కోరారు. సమావేశానికి ముందు ప్రజా కవులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అస్థాన కవి దాశరధి కృష్ణమా చార్య, దాశరధి రంగాచార్యలకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులైన కూరపాటి రామకోటయ్య, పెండ్యాల సూర్యనారాయణ, మహ్మద్ అబ్దుల్ హామీద్, మహ్మద్ షాబుల్ హుసేన్, ఎన్. భాస్కర్‌రావు, బి.లక్ష్మీకాంతారావులతో పాటు నాటి స్వాతంత్య్ర సమరయోధుడు తోడేటి కొమరయ్య, కందునూరి మల్లయ్య, మారేపల్లి ప్రసాదరావు, కానాల నరసింహారెడ్డి, గట్టు అనంతరాములు, ఎడ్ల అప్పయ్య, సిహెచ్.రామయ్య, ఎర్రబోయిన బిక్షమయ్యలను ఘనంగా మెమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన అహ్వాన కమిటీ కన్వీనర్ జర్పుల భీముడునాయక్‌ను సహితం సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖలు పాల్గొన్నారు.