ఖమ్మం

కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న మోదీ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, జూన్ 25: కేంద్రంలో మోదీ ప్రభుత్వం బడా కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. ఆదివారం వరంగల్ క్రాస్‌రోడ్‌లోని తమ్మినేని సుబ్బయ్య భవన్‌లో పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన సిపియం రూరల్ మండల రాజకీయ శిక్షణాతరగతుల్లో నున్నా నాగేశ్వరరావుతో పాటు బత్తుల లెనిన్ తరగతులను బోధించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మోదీ దేశాన్ని గుజరాత్ రాష్ట్రంలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత కార్పోరేట్ సంస్థలు, బడా వ్యాపారులకు రకరకాల రాయితీలిస్తూ, దేశానికి అన్నం పెట్టే రైతన్నను విస్మరిస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైతులు శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే ఎలాంటా హెచ్చరికలు లేకుండా కాల్పులు జరపడంతో ఆరుగురు రైతులు మరణించారన్నారు. శాస్తవ్రేత్తలు స్వామినాధన్, జయంతి ఘోష్‌లు ప్రతిపాదించిన విధంగా వ్యవసాయ పెట్టుబడుల్లో 50 శాతం ప్రభుత్వమే భరించాలన్న సూచనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం దేశభక్తి గురించి మాట్లాడే ప్రభుత్వం అనుసరించే విధానాల్లో దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పెంచిపోషిస్తోందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ళ పెండింగ్ బిల్లులు నేటికీ చెల్లించలేదని, దునే్నవానికే మూడెకరాల భూమి ముచ్చటగానే మిగిలిందని ఎద్దేవా చేశారు. హక్కుపత్రాలు కలిగివున్న గిరిజన భూములను సాగు చేసుకోకుండా నిర్బంధం చేస్తుందని, ఆవిధానాలను మానుకోకుండా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.
తొలుత పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకుడు చామకూరి రత్నం ఆవిష్కరించారు. తుమ్మల శ్రీనివాసరావు, పి మోహన్‌రావు, సిద్దినేని కోటయ్య, బందెల వెంకయ్య, బి వెంకటేశ్వర్లు, పి సత్యనారాయణ, కృష్ణ, సుదర్శన్‌రావు, తుమ్మల సురేష్ తదితరులు పాలొ గన్నారు.