విజయనగరం

వారా.. మమ్మల్ని విమర్శించేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 25: పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ పట్టణంలో కనీసం ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా తీసుకురాలేక పోయిని వారా మమ్మల్ని విమర్శించేది అని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు వైకాపా నేతలను ఎద్దేవా చేశారు. ఆదివారం అశోక్‌బంగ్లాలో తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అశోక్ మాట్లాడుతూ మూడేళ్ల తెలుగుదేశం పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వైకాపా నేత బొత్స సత్యనారాయణ విమర్శించడం పట్ల మండిపడ్డారు. మూడేళ్లలో మేం ఏం అభివృద్ధి చేశామన్నదీ మానవ అభివృద్ధి నివేదికలు చూస్తే తెలుస్తుందన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా పాలన సాగిస్తున్నామన్నారు.
భారత్‌లో ఇంకా నిరక్షరాస్యులు అధికంగా ఉన్నారని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ‘చిట్టిగురువులు’తో ముందడుగు వేశామన్నారు. ద్వారపూడి, ముగడలలో ప్రారంభించామని, విద్యార్థులే తల్లిదండ్రులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం ఆభినందనీయమన్నారు. నిరక్షరాస్యతను రూపుమాపేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. తమ హయాంలో ఎంపి ల్యాడ్స్ నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేసింది బోర్డులో ప్రదర్శించామన్నారు. ఈ సమావేశంలో మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, ఎమ్మెల్యే గీత, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిరాణి పాల్గొన్నారు.