విజయనగరం

అక్టోబర్ నాటికి రాజపులోవ రహదారి పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 25: రాజపులోవ-విజయనగరం జాతీయ రహదారిని అక్టోబర్ 2వతేదీలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఆదివారం ఇక్కడ జెడ్పీ అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 62 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 38 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. పనులు ఏమేరకు పూర్తి చేశారన్నదీ తాను పరిశీలించినట్టు చెప్పారు. కాగా, ఇందులో విశాఖకు సంబంధించి 1.2 కిలోమీటర్లు, విజయనగరం జిల్లాకు సంబంధించి 4.5 కిలోమీటర్లు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా విజయనగరంలోని వై జంక్షన్ నుంచి విజయనగరం టౌన్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు తనను కోరారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ఖర్చు భరిస్తే, రోడ్డు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. మరోపక్క విజయనగరం బైపాస్ రోడ్డును 17.2 కిలోమీటర్లతో నిర్మాణం చేపట్టనున్నామన్నారు. ఇందుకు రూ.264 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశామన్నారు. ఇందులో 50 శాతం ప్రభుత్వ భూములు ఉన్నాయని, మిగిలిన 37 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. బోగాపురం ఎయిర్‌పోర్టు పనులు టెండర్లు దశలో ఉన్నాయన్నారు. ఈ పనులన్నింటిని ప్రారంభించేందుకు కేంద్రమంత్రి గడ్కారీని, ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించనున్నట్టు ఆయన తెలిపారు. కాగా, రాష్ట్రంలో నాలుగు లైన్ల బైపాస్ రోడ్డు విజయనగరం ఒక్కటేనని స్పష్టం చేశారు. బైపాస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోగలదన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గీత, పతివాడ నారాయణస్వామినాయుడు, కెఎ నాయుడు పాల్గొన్నారు.