విజయనగరం

సుజల స్రవంతితో ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 25: ఉత్తరాంధ్ర అభివృద్ధికి సుజల స్రవంతి ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల సాధన సమితి కన్వీనర్ కొణతాల రామకృష్ణ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు ఎంతో కీలకమన్నారు. ఇందుకు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం మెసానిక్ టెంపుల్‌లో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల సవ్రంతితో ఈ మూడు జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. అయితే పాలకుల నిర్లక్షంవల్ల ఈ ప్రాంతం వెనుకబాటుతనంతో ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఉత్తరాంధ్రలో ఒక్క విజయనగరం జిల్లాలోనే 9వేల చెరువులు ఉన్నాయన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి చెరువులను అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీరు సాగునీరు అందించగలరని కొణతాల అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే వెనుకబడిన జిల్లాగా ఉన్న విజయనగరం అభివృద్ధి చెందగలదన్నారు. కేవలం రూ.3వేల కోట్లతో పూర్తి చేయడానికి అవకాశం ఉన్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నిర్మించకుండా ప్రభుత్వం వట్టిసీమకు రూ.16వేల కోట్లు కేటాయించిందన్నారు. గుర్ల గెడ్డకు కేవలం రూ.4కోట్లు ఖర్చు చేస్తే 16వేల ఎకరాలకు సాగునీరు అందించగలమన్నారు.
ఉత్తరాంధ్ర వైకాపా కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతన వ్యక్తిగత లొసుగుల వల్ల రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టారని విమర్శించారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా కొణతాల చేస్తున్న పోరాటానికి ఆయన మద్దతుపలికారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జిల్లా వెనుకబాటుతనంతో ఉందన్నారు. జిల్లాలో గనులను కార్పొరేట్లు దోచుకుంటున్నారన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదిరాజు మాట్లాడుతూ పదవుల్లోకి వచ్చిన రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఫలితాలు వస్తాయన్నారు. ప్రొఫెసర్ జిఎస్ చలం మాట్లాడుతూ పోరాటంతో వెనుకబాటును పోగొట్టగలమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలికంగా ఉద్యమాలు చేస్తున్నామని విశ్రాంత ఐఎఎస్ అధికారి సిఎస్‌రావు అన్నారు. ఈ సమావేశంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల కవులు, మేథావులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.