శ్రీకాకుళం

ప్రభుత్వం పక్షాన నిలవండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 25: మైనార్టీవర్గాల అభివృద్ధి, ఆర్థిక పరిపుష్టితకు ఎంతో కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముస్లిమ్‌లంతా నిలవాలంటూ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం మీ పక్షాన ఉంటుందని, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ అన్నీ వర్గాలను అభివృద్ధి పరిచే దిశగా పనిచేస్తున్న ప్రభుత్వం వైపు మైనార్టీలంతా ఉండాలంటూ కోరారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అన్నీ వర్గాలవారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివారం రాత్రి ఇక్కడ జామీయామసీదులో శ్రీకాకుళం నగర ముస్లిమ్‌లకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ముస్లింసోదరులకు, అక్కచెల్లెల్లకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గత మూడేళ్ళుగా సరికొత్త విధానంలో అన్నీ వర్గాల వారికీ ముస్లిమ్‌సోదరులు ఇఫ్తార్ విందు ఇచ్చేవిధంగా ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పేదరికం లేని సమాజం కొసమేనన్న సంకేతాన్ని అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసే ప్రయత్నమే అన్నారు. 1993లో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే తొలిసారిగా మైనార్టీవర్గాల అభ్యున్నతికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడం జరిగిందని అచ్చెన్న గుర్తుచేసారు. ఆ రోజుల్లో బడ్జెట్ చాలా తక్కువగా ఉండేదన్నారు. గత ప్రభుత్వాల వరకూ కేవలం రూ. 30 కోట్లు మాత్రమే ఉండే బడ్జెట్‌ను గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ. 640 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేయగా, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 840 కోట్లు కేటాయింపులు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు. చాలా రాష్ట్రాల్లో లేని విధంగా ముస్లిమ్ సోదరుల విద్యాభ్యాషం కోసం ఏకంగా రూ. 200 కోట్లు కేటాయింపులు చేసినట్టు పేర్కొన్నారు. బిసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్స్ మాదిరిగానే మైనారిటీ, ముస్లిమ్ విద్యార్ధుల కోసం రెసిడెన్షియల్ సూళ్ళు ఏర్పాటు చేసామన్నారు. విదేశీ చదువుల కోసం రూ. 5 కోట్లు ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు మంజూరు చేస్తుందన్నారు. రంజాన్ పండుగ ఘనంగా నిర్వహించుకునేలా తోఫా ఇచ్చే ప్రభుత్వం, సంక్రాంతి పండుగకు కూడా మరోసారి సంక్రాంతి కానుక ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనంటూ పేర్కొన్నారు. ముస్లిమ్‌ల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కర్నూల్‌లో ఉర్థూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ ఏడాదిలో ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. సమాజంలో ఒక వర్గమే అభివృద్ధి జరగకూడదన్న లక్ష్యంతోనే బాబు సర్కార్ అన్నీ వర్గాల అభివృద్ధిలో సమతూల్యత పాటిస్తున్నారన్నారు. రంజాన్ పండుగ వస్తే మసీదులకు బూజులు దులుపుకోలేని పరిస్థితుల్లో ముస్లిమ్ సోదరులు ఉండేవారని, వారికి సర్కార్ సహాయం ఉండేదికాదని, ఇప్పుడు రాష్టమ్రంతటా మసీదులకు రంగులు వేసుకునేందుకు, మరమ్మత్తులు చేసుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. ఇందులోభాగంగా జిల్లాలో 58 మసీదులకు నిధులను మంత్రి అచ్చెన్న చేతులమీదుగా అందజేసారు. ముఖ్యంగా ముస్లిమ్‌వర్గాలకు స్మశానవాటికలు కావల్సివున్నాయంటూ తన దృష్టికి వచ్చిన అత్యంత అవసరమైన అంశాన్ని జిల్లాలో ప్రాధమిక కర్తవ్యంగా కలెక్టర్ తీసుకోవాలని, ముస్లిమ్ సోదరులు అడిగిన ప్రాంతాల్లో స్మశానవాటికలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని విందు వేదిక నుంచి ఆదేశాలు మంత్రి అచ్చెన్న ఆదేశాలు ఇచ్చారు. రిజర్వేషన్ ఇచ్చేందుకు సాధ్యసాధ్యాలు అధ్యనం చేస్తున్న మేథావివర్గం నుంచి అతిత్వరలో వచ్చే సూచనలు, సలహాలు మేరకు ముస్లిం వర్గాల రిజర్వేషన్ విధానాన్ని ప్రకటించేందుకు బాబు సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని, వాటిని జిల్లాలో ప్రతీ మారుమూల ప్రాంతంలో గల మైనార్టీలందరికీ బాబు సర్కార్ చేసే అభివృద్ధి, సంక్షేమం వివరించి చెప్పాలని అచ్చెన్న విజ్ఞప్తి చేసారు. మీ పక్షాన నిలిచే ప్రభుత్వానికి మీరంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జెసీ రజనీకాంతారావు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ చౌధరి ధనలక్ష్మీ, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి మాట్లాడారు. ముందుగా మంత్రి అచ్చెన్నతోపాటు ఇంధనశాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు పాల్గొని ముస్లింసోదరులతో నమాజ్ చేసారు. అనంతరం విందు ఆరంగించి అక్కడ నుంచి మంత్రి కళా వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముస్లిం సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.