విశాఖపట్నం

నిబంధనలు గాలికి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), జూన్ 25: నగరంలోను, జిల్లాలోను అనధికారికంగా మద్యం విక్రయాల జోరు అందుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా అధిక ధరకు విక్రయిస్తూ మందుబాబుల జేబులను కొల్లగొడుతున్నారు. దీనికి తోడు కల్తీమద్యం అమ్మకాలు ఎక్కువ కావడంతో కూలీనాలీ చేసుకునే కార్మికుడు ఈ మద్యం సేవించి అనారోగ్యం పాలవుతున్నాడు. బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించామని చెప్పుకుంటున్న ఎక్సైజ్ అదికారులు, ఆచరణలో విఫలమయ్యారనేది జగమెరిగిన సత్యం. సాధారంగా మద్యం దుకాణాలు ఉదయం 10 గంటలకు తెరిచి, రాత్రి పది గంటలకు మూసి వేయాలి. అదే విధంగా బార్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 11 గంటలకు మూసి వేయాలి. ఇక దాబాల్లో మద్యం అమ్మకూడదు. అయితే ఎక్సైజ్ అధికారుల అండదండలతో కొన్ని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు నైట్ సేల్స్ పేరుతో తెల్లవార్లు మద్యం విక్రయాలు జరుపుతున్నాయి. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ఓ మద్యం దుకాణం, నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ సమీపంలోని మరో దుకాణం, రుషికొండకు వెళ్లే బీచ్‌రోడ్డులో బార్ అండ్ రెస్టారెంట్, తదితర దుకాణాల్లో ఇది నిత్యకృత్యం. ఇలా ఎన్నో దుకాణాల్లో జరుగుతుండడం గమనార్హం. నెలవారీ మామూళ్ళు ఆయా స్టేషన్ల పరిధిలోని ఎక్సైజ్ పోలీసులకు అందడంతో నైట్ సేల్‌పై ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోరని పలువురంటున్నారు.
మద్యం దుకాణాలలో మందుబాబులు మద్యం సేవించాలంటే అక్కడ పర్మిట్ రూమ్ ఉండాలి. ఇందుకు గాను ఎక్సైజ్ శాఖ నుండి లైసెన్స్ తీసుకోవాలి. అయితే ఇవేమి పాటించకుండా కొన్ని మద్యం దుకాణాల యజమానులు, తమ దుకాణాల ఆవరణలోనే వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు ఎర్పాటు చేసి
బార్ అండ్ రెస్టారెంట్‌గా మార్చేస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద పూర్తిగా బాటిళ్ళనే విక్రయించాలి. అయితే ఆఫ్ గ్లాసు, పూర్తి గ్లాసులతో లూజు విక్రయాలు పబ్లిక్‌గా మద్యం దుకాణాల వద్ద జరుగుతున్న ఎక్సైజ్ పోలీసులు నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరించడం దారుణం. దీనికి తోడు ఎమ్‌ఆర్‌పి రేట్లకు మించి మద్యాన్ని విక్రయిస్తున్నట్టు స్థానిక ఎక్సైజ్ పోలీసులకు తెలిసిన, వారు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
ఇక దాబాల సంగతి చెప్పక్కరలేదు. నగరంలోను, జిల్లాలలోను మారు ప్రాంతాలలలో దాబాలు బార్ అండ్ రెస్టారెంట్లుగా మారిపోతున్నాయి. ఎక్సైజ్ నిబంధనల మేరకు దాబాల్లో మద్యం విక్రయించరాదు. ఈ నియమాలను తుంగలో తొక్కి దర్జాగా అక్కడ మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. ఉదాహరణకు సాగర్‌నగర్‌లోని ఓ దాబాయే ఇందుకు సాక్ష్యం.
ఇక బెల్ట్ షాపుల సంగతి చెప్పక్కరలేదు. కొన్ని మద్యం దుకాణాలకు అనుసంధానంగా బెల్ట్ దుకాణాలుంటాయి. ఇవి ప్రతి జంక్షన్‌లోను, వీధుల్లో కామన్‌గా కనపడుతుంటాయి. అయితే టాస్క్ఫోర్స్ పోలీసులు బెల్ట్ దుకాణాలపై దాడులు చేసి, ఆయా యజమానులను అదుపులోకి తీసుకుని, మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకోవడం నిత్యం జరుగుతున్న సంఘటనలే. ఇంత జరుగుతున్న బెల్ట్ దుకాణాలను పూర్తిగా నిర్ములించామని ఎక్సైజ్ అధికారులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది.
మద్యం దుకాణాల ముందు 18ఏళ్ళు నిండిన వారు మద్యం సేవించకూడదనే బోర్టు నామమాత్రమే. మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలలో 16-18వయస్సు గల వారే ఎక్కువగా మద్యం సేవిస్తూ కనిపిస్తుంటారు. అయితే పై నిబంధనను అమలు చేయకపోవడంపై సీనియర్ సిటిజన్లు మండి పడుతున్నారు.
దీనిపై ఎక్సైజ్ డిసి గోపాలకృష్ణను ‘ఆంధ్రభూమి’ వివరణ కోరగా, అనధికార మద్యం విక్రయాలపై ఎవరు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. బెల్ట్ దుకాణాలు, దాబాల్లో మద్యం విక్రయాలపై ఎవరైన తమకు ఫిర్యాదు చేయవచ్చని, దాడులు చేసి, కేసులు నమోదు చేస్తామన్నారు.