విశాఖపట్నం

సినారెను ఆదర్శంగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 25: సినీ రంగం గౌరవం పెంపొందించే విధంగా సాహితీ శిబిరం డాక్టర్ సి.నారాయణరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రవిశ్వవిద్లాయం వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. విజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం కవి, లఘుచిత్ర దర్శకుడు సత్తివాడ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సినారె సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ పాల్గొని మాట్లాడుతూ ఆయన రాసిన రచనలు, గేయాలు సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో గొప్ప పాటలను అందించారన్నారు. తాను హై స్కూల్‌లో చదువుకున్న రోజుల్లో ఆయన రచించిన పాఠ్యాంశాలను చదువుకున్నానన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాలంలో రీడర్‌గా పనిచేశారని గుర్తుచేశారు. ప్రొఫెసర్‌గా ఉంటూనే సాహితీరంగంలో తనదైనశైలిలో కృషిచే అనేక అవార్డులు కైవసం చేసుకున్నారు. ఆయన ఎన్‌టిఆర్ నటించిన చిత్రంలో శివశంకరి...అను పాటను ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. సాహిత్యం,సంగీతం, లయబద్ధంగా వేలాది పాటలను అందించారన్నారు. ఆయన తెలుగువాడిగా, ఆంధ్రాలో జన్మించడం మన అదృష్టమన్నారు. ఆయన మాదిరి తెలుగు పరిశ్రమలో మళ్ళీ మంచి అర్ధాన్ని చేకూర్చే పాటలు రావాలన్నారు. ఆయన లేని లోటు సినీ రంగానికే కాకుండా తెలుగుభాషా, సాహితీరంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు. అటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుని అవకాశం కల్పించిన నిర్వహకులకు దన్యావాదాలు తెలియజేశారు. మరోవక్తగా పాల్గొన్న విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన సినారె ఇక లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయన రాసిన ప్రతి రచన, గేయాలు చలోక్తిగా ఉంటూ అన్ని వయస్సుల వారిని ఆకట్టుకునే విధంగా ఉండేదన్నారు. గొప్ప శ్రావ్య శబ్ధాన్ని అందివ్వడంలో ఆయనకు ఆయనే చాటి అని అన్నారు. ఆయనను నేటి రచయితులు, సాహితీవేత్తలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రముఖ సాహితీవెత్త వెంకట సూర్యారావు మాట్లాడుతూ ఏపీలో చారిత్రాత్మక ఘట్టాలు తీసుకుని అద్భుతమైన పాటలు అందించారన్నారు. 19 ప్రక్రియల్లో 70కు పైగా రచనలు రాసారన్నారు. మూడు వేలకు పైగా పాటలు రాసారన్నారు. సినీ కవిగా లోకానికి సుపరిచితులు అయిన దానికన్నా ముందు గొప్ప గేయ కవి అని వెల్లడించారు. ఎన్నో చారిత్రక కావ్యాలు అందించారని, ఆయన లేని లోటు తీరదన్నారు. ఎవరు చిన్న పుస్తకం రాసినా, ఎంత చిన్నవాడైనా వారిని అభినందించడంలో ఆయన చూపిన అభిమానం వెలకట్టలేనదన్నారు. తన రాసిన రచనను ఆయన సంభోబించి, క్లుప్తికరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నిర్వాహకుడు కవి, లఘుచిత్ర దర్శకుడు సత్తివాడ శ్రీకాంత్ మాట్లాడుతూ ఊహకందని ఉపమానాలు అందించే మహానీయుడు సినారె అని కొనియాడారు. తొలుత సినారె చిత్ర పటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు.