గుంటూరు

లాభాల బాటలో ఆర్టీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపల్లె, జూన్ 25: జిల్లాలోని 13 ఆర్‌టిసి డిపోల్లో ఇప్పటికే 4 డిపోలు లాభాల బాట పట్టాయని ఆర్‌టిసి రీజనల్ మేనేజర్ శ్రీహరి అన్నారు. ఆదివారం ఉదయం రేపల్లె ఆర్‌టిసి. గ్యారేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో నష్టాల్లో ఉన్న డిపోలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుండడంతో లాభాల బాటపడుతున్నాయని స్పష్టం చేశారు. గుంటూరు-2, తెనాలి, నరసరావుపేట, మాచరం డిపోలు లాభాల్లో ఉన్నాయన్నారు. మిగిలిన డిపోల్లో కూడా నష్టాలు తగ్గించి లాభాలు పండిస్తామని తెలిపారు. లాభాలు అధికంగా వచ్చే రూట్లలో అధిక సంఖ్యలో బస్సులు నడిపి అతిత్వరలోనే నష్టాల నుండి గట్టెక్కుతామని స్పష్టం చేశారు. జిల్లాలోని డిపోల్లో 1090 మంది సిబ్బంది, అధికారులు పనిచేస్తున్నారని, సిబ్బంది కొరత లేదని చెప్పారు. ఇకనుండి ప్రతిడిపోలో ఓ ధ్యానమందిరాన్ని ఏర్పాటుచేసి శిక్షణపొందిన నిపుణలతో ప్రతి డ్రైవర్, కండక్టర్, మెకానిక్‌లు డ్యూటికి వెళ్లేముందు కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకొని వెళితే మానసిక ప్రశాంతతో పనిచేయగలుగుతారని ఆర్‌ఎం శ్రీహరి వివరించారు. ప్రతి గ్రామానికి కనీసం రెండు సార్లు బస్సులు తిప్పటానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ డిపోలు లాభాలభాటలోకి రావటానికి ముఖ్యకారణం అధికారులు, సిబ్బంది, కార్మికసంఘాలు కలసి పనిచేద్దాం -లాభాలనుతీసుకొద్దాం ఆనేనినాదంతోపనిచేయటమేనని అన్నారు. ప్రమాదాలను అరికట్టి ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యాలకు చేర్చాల్సిన బాధ్యత మనపై వుందన్నారు. అనంతరం డిపోలోని గ్యారేజీలలో బస్సు రిపేరు చేస్తున్న మెకానిక్స్‌తో ముచ్చటించి, బస్సుల పనితీరుగూర్చి అడిగి తెలుసుకొన్నారు. సమావేశంలో అధికారి వాణిశ్రీ, డిఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.