గుంటూరు

పట్టణంలో ఘనంగా జగన్నాథ రథయాత్రా మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, జూన్ 25: పట్టణంలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇస్కాన్ శ్రీ రాధా గోవింద చంద్ర మందిరంలో ఆదివారం ఉదయం శ్రీశ్రీ జగన్నాథ రధయాత్రను ప్రారంభించారు. జగన్నాథ బలదేవ సుభద్రామయుల రధము దేవాలయం నుండి బరంపేట, సత్తెనపల్లి రోడ్డు, మల్లమ్మ సెంటర్, శివునిబొమ్మ సెంటర్, పండురంగాస్వామి దేవాలయం, విద్యుత్ కార్యాలయం మీదుగా మందిరానికి చేరుకుంది. భ క్తులు శ్రీజగన్నాథ బలదేవ సుభద్రామయుల రధానికి భక్తితో నీళ్ల వారు పోసి, మంగళహారతులను సమర్పించారు. రథయాత్ర సందర్భంగా దేవాలయంలో, బరంపేటలో రంగవల్లికలతో అలంకరించారు. భక్తులచే కోలాటం, పిల్లలకు దేవతా వేషధారణ, భక్త బృందగానం, రంగురంగుల జెండాలతో కన్నుల పండుగగా రధయాత్ర జరిగింది. రాధాగ్రేచ వామనం దృష్ట్యా పునర్జన్మని విద్యతే..అంటే రథారూడుడైన శ్రీ జగన్నాధ స్వామిమి దర్శించుకున్న వారికి పునర్జన్మ లేదని పద్మ పురాణం చెబుతుందని భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు పేర్కొన్నారు. మందిరానికి చేరిన పిదప మంత్రోచ్ఛారణలతో స్వామివారికి స్వాగతం పలికి మధ్యాహ్నం 58 రకాల భక్ష్యాలతో మహారాజ భోగ నివేదన సమర్పించారు. సాయంత్రం జగన్నాధుని లీలలు, భగవద్గీతా ప్రవచనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వెంకట రమణ గోవింద పాద వారు పర్యవేక్షించారు.