గుంటూరు

షటిల్ క్రీడలో గుంటూరుకు అంతర్జాతీయ ఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (స్పోర్ట్స్), జూన్ 25: గుంటూరు నగరానికి చెందిన కిడాంబి శ్రీకాంత్ చిన్ననాటి నుండి షటిల్ క్రీడపై మక్కువతో స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలో శిక్షణ పొంది, అనంతరం అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగి ఆదివారం ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్‌లో విజేతగా నిలవడంతో మరోమారు గుంటూరుకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. బృందావన గార్డెన్స్‌లోని శ్రీకాంత్ నివాసంలో మ్యాచ్‌ను తిలకించిన తల్లిదండ్రులు, పలువురు క్రీడాకారులు, బంధువులు ఉద్వేగానికి లోనయ్యారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీలో ఒలంపిక్ ఛాంపియన్ చెంగ్‌లాన్‌పై అద్భుత విజయాన్ని శ్రీకాంత్ సాధించడంతో కుటుంబీకుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. ఇదే క్రమంలో గత వారం జరిగిన ఇండోనేషియా ఓపెన్ సిరీలో విజేతగా నిలిచి అదే స్పూర్తి, విశ్వాసంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్ షిప్‌ను శ్రీకాంత్ హస్తగతం చేసుకున్నాడు. గతంలో కూడా మొదటి సారిగా చైనా ఓపెన్ సిరీస్‌ను కైవసం చేసుకుని ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. శ్రీకాంత్ విజయంతో పలువురు ప్రముఖులు, కోచ్‌లు, క్రీడాకారులు శ్రీకాంత్ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా షటిల్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రాయపాటి రంగారావు, సంపత్‌కుమార్, తండ్రి కివిఎస్ కృష్ణ, ఎన్‌టిఆర్ స్టేడియం షటిల్ శిక్షకుడు షేక్ అన్వర్‌బాషా, బంధుమిత్రులు శశాంక్, మురళీకృష్ణంరాజు తదితరులు కిడాంబి శ్రీకాంత్ విజయం పట్ల హర్షం వ్యక్తంచేశారు.