తూర్పుగోదావరి

జయహో శ్రీకాంత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, జూన్ 25: భారత యువ షట్లర్ తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలవడంతో రావులపాలెంలో హర్షం వ్యక్తమవుతోంది. శ్రీకాంత్ సుమార్ 24 ఏళ్ల క్రితం రావులపాలెంలోని జయశ్రీ ఆసుపత్రిలో జన్మించడంతో ఆనాటి జ్ఞాపకాలు స్థానికులు గుర్తుచేసుకున్నారు. ఆ వివరాలను రావులపాలెంకు చెందిన శ్రీకాంత్ మేనమామ కొమండూరి దొర ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. శ్రీకాంత్ తన చిన్నక్క రాధాముకుంద చిన్న కుమారుడని ఆయన చెప్పారు. తండ్రి వెంకట శేష కృష్ణ గుంటూరుకు చెందినవారు కాగా, తల్లి రాధాముకుంద పశ్చిమ గోదావరి జిల్లా ములపర్రుకు చెందినవారు. వీరి చిన్న కుమారుడైన శ్రీకాంత్ రావులపాలెంలో జన్మించారు. ఆయన పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణపొంది బ్యాడ్మింటన్ క్రీడలో దినదినాభివృద్ధి సాధించారు. ఈయన ఇప్పటి వరకూ నాలుగు సూపర్ సిరీస్‌లు గెలుచుకోగా, రెండు వారాల వ్యవధిలోనే ఇండోనేషియా సూపర్ సిరీస్, ఆస్ట్రేలియా సూపర్ సిరీస్‌లో విజేతగా నిలవడంతో రావులపాలెంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో చైనా సూపర్ సిరీస్ గెలిచిన శ్రీకాంత్, 2017లో సింగపూర్ సిరీస్ రన్నర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌కు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, గ్రామ విద్యాభివృద్ధి కమిటీ ఛైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి, మేనమామ కొమండూరి దొర, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.