తూర్పుగోదావరి

ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 25: ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆదివారం అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే ఆనందరావులతో కలిసి అమలాపురం పురపాలక సంఘ పరిధిలో నిర్మించే సిసి రహదారులు, డ్రెయిన్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ అమలాపురం పట్టాణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. ముందుగా రూ.12.05 లక్షలతో 6వ వార్డు సాయినరసింహనాయుడు ఇంటివద్ద నిర్మించే సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం 3వ వార్డులో సాయిబాబా గుడి నుండి గోకరకొండ సుబ్రహ్మణ్యం ఇంటివరకూ రూ. 6.41 లక్షలతో నిర్మించే సిసి రోడ్డు, డ్రెయిన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. 30వ వార్డు రావులచెరువు, నల్లవంతెన నుండి బురద వంతెన వద్ద గల మేజర్ డ్రెయిన్ వరకు రూ.9.51 లక్షలతో సిసి డ్రెయిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2015-16 టిఎస్పీ నిధులు రూ.19.89 లక్షలతో 25వ వార్డులో ఎజి రోడ్డు నుండి ప్రభాకర్ నగర్ వరకూ నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం రూ.2 కోట్లతో అభివృద్ధి చేయునున్న తామర చెరువు పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ త్వరలోనే అమలాపురం పట్టణాన్ని అత్యంత సుంధరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపి పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ పురపాలక సంఘ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరుకు సహకరిస్తామన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని పట్టణాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామన్నారు.