తూర్పుగోదావరి

రూ. కోటితో పంచాయతీరాజ్ ఇఇ కార్యాలయానికి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం ఎర్ర వంతెన దిగువన గ్రామీణాభివృద్ధి నిధులు రూ. కోటి రపాయలతో నిర్మించే పంచాయితీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీరు కార్యాలయం, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ నిర్మాణాలకు ఉప ముఖ్యమంత్రి రాజప్ప శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజప్ప మాట్లాడుతూ పంచాయితీరాజ్ సంస్థలను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేస్తున్నారన్నారు. అన్ని గ్రామాల్లో రహదారులు, మంచినీరు, అంగన్‌వాడీ భవనాలు నిర్మించి వౌలిక వసతులు కల్పించి ప్రజల అవసరాలు తీరుస్తున్నారన్నారు. రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎంపి పండుల రవీంద్రబాబు, పి గన్నవరం, అమలాపురం ఎమ్మెల్యేలు పులపర్తి నారాయణమూర్తి, అయితాబత్తుల ఆనందరావు, జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రవౌళి, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, ఎంపిపి బొర్రా ఈశ్వరరావు, జడ్పీటీసీలు అధికారి జయవెంకటలక్ష్మి, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, వేగిరాజు ప్రవీణ, ఆర్డీఒ జి గణేష్‌కుమార్, పంచాయితీరాజ్ ఇఇ బి సత్యనారాయణరాజు, డిఇఇలు వివి రమేష్, మురళీకృష్ణ, ఎఇ ఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.