పశ్చిమగోదావరి

జిఎస్టీతో మధుమేహ రోగులకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 25: మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారి ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం కరుణ చూపించింది. ఫలితంగా ఇన్సులిన్ ధరలు తగ్గనుండటంతో ఆర్థికంగా మధుమేహ రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. జిఎస్టిని 12 నుంచి 5 శాతానికి తగ్గించడంతో ఆర్థికంగా మధుమేహ రోగులకు మేలు జరగనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో మూడేళ్లు నుంచి 67 సంవత్సరాలకు వరకు ఈ వ్యాధితో బాధపడుతున్నవారు లక్షల సంఖ్యలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ ఇంటిలోని ఖచ్చితంగా ఇద్దరు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవారు ఉన్నారని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 మంది వైద్యులు ఉన్నారు. వీరి వద్దకు రోజుకు కనీసం 15 మంది వెళ్తుంటారు. ఈ లెక్కన చూస్తే వీరిలో 15శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ఉన్నారని అంచనా. ఇక వీరిలో ఇన్సులిన్ వానియోగించేవారు ఇటీవల కాలంలో ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా 3నుంచి 20 ఏళ్లలోపువారికి తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తోంది. అలాగే 35 ఏళ్లు దాటినవారి నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి మొదట మూడేళ్ల వరకు మాత్రలను వినియోగిస్తున్నారు. ఆ తర్వాత వ్యాధి తగ్గకుంటే వారికి తప్పనిసరిగా ఇన్సులిన్ వెయ్యాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా రోజుకి 10 పాయింట్లు వినియోగిస్తే నెలకు కనీసం సగటున రూ.2వేలకు పైనే ఖర్చవుతోంది. ఒక వ్యక్తి ఇన్సులిన్‌కు అలవాటుపడిన తర్వాత కనీసం పది నుంచి 40 ఏళ్ల వరకు వినియోగించుకునే అవకాశం ఉటుందని మధుమేహ వైద్యులు చెబుతున్నారు. ఇక ఆర్‌ఎంపి, పిఎంపి వ్యవస్థను పరిశీలిస్తే వారి వద్దకు వెళ్లేవారి సంఖ్య కూడా ఏ మాత్రం తక్కువకాదని చెప్పవచ్చు. ఈ లెక్కన చూస్తే మధుమేహ రోగులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చర్చించుకుంటున్నారు. ఆహార నియమం పాటించడం, ప్రతీ రోజు వ్యాయామం చెయ్యడం, నడక , యోగా వంటివి చెయ్యడం వల్ల ఈ వ్యాధిని అదుపులో ఉంచుకునే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.